Retail Business: భారత్ లో తమ వ్యాపారాన్ని మూసేస్తున్న జర్మన్ రిటైలర్..! ఆ కారణంతోనే నిర్ణయం..

Retail Business: దేశంలోని రిటైల్ వ్యాపారంలో ఉన్న సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను నిలివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని కొనేందుకు అనేక రిటైల్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి.

Retail Business: భారత్ లో తమ వ్యాపారాన్ని మూసేస్తున్న జర్మన్ రిటైలర్..! ఆ కారణంతోనే నిర్ణయం..
Metro Stores
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 23, 2022 | 3:29 PM

Retail Business: దేశంలోని రిటైల్ వ్యాపారంలో ఉన్న మెట్రో సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను నిలివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కంపెనీ ఆశించిన రీతిలో వ్యాపారం పుంజుకోకవోవటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాదాపు 19 సంవత్సరాల పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తున్న కంపెనీ ఇలాంటి నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. దాదాపు 21 నగరాల్లో కంపెనీకి 31 స్టోర్లు ఉన్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కంపెనీ తన మెుదటి స్టోర్ ఏర్పాటు చేయటం సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉండటం వల్ల మార్జిన్లు తక్కువగానే ఉన్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉన్నందున కంపెనీ మన దేశంలోని తన వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

2025 నాటికి కంపెనీ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే కంపనీకి ఉన్న 31 స్టోర్లతో పాటు 5 కలెక్షన్ సెంటర్లను అమ్మేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మెుదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సర్వీస్ ప్రొవైడర్ జేపీ మోర్గన్ కు కొనుగోలు దారులను చూడాలని కోరింది. ఇప్పటికే రిటైల్ వ్యాపారంలో కీలక భూమిక కలిగిన రిలయన్స్, డీమార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు మెట్రో వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని ఫలితాలు రాకపోవటం వల్ల ఇప్పటికే రష్యా, జపాన్, మయన్మార్లలోని తమ వ్యాపారాలను క్లోజ్ చేసింది. ఈ మెగాడీల్ చేజిక్కించుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న రిటైల్ కంపెనీలకు కొత్త వ్యాపారం, అదనపు ఆదాయం వచ్చి చేరనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్