Home Loan: వడ్డీ రేట్ల పెంపుతో హోమ్ లోన్ భారమైందా..? ఇలా చేసి ఖర్చు తగ్గించుకోండి..
Home Loan: రిజర్వు బ్యాంక్ రెపో రేటును పెంచటంతో హోమ్ లోన్ రేట్లను అన్ని బ్యాంకులు దాదాపుగా పెంచాయి. ఎందుకంటే అవి ఫ్లోటింగ్ రేట్ విధానాన్ని అమలు చేస్తాయి కాబట్టి.
Home Loan: రిజర్వు బ్యాంక్ రెపో రేటును పెంచటంతో హోమ్ లోన్ రేట్లను అన్ని బ్యాంకులు దాదాపుగా పెంచాయి. ఎందుకంటే అవి ఫ్లోటింగ్ రేట్ విధానాన్ని అమలు చేస్తాయి కాబట్టి. ఇప్పుడు అనేక మంది లోన్ తీసుకున్నవారికి ఉండే అనుమానం ఏమిటంటే ఈ లోన్ మెుత్తాన్ని ఫిక్స్‌డ్ వడ్డీ రేటుకు మార్చుకునే అవకాశం ఉంటుందా? అన్నదే. అసలు తమపై పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించుకోవటం ఎలా అని అనేక మంది ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు వాటికి ఉండే ఆప్షన్లను అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం..
ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే వడ్డీ రేటు రిస్క్‌ను ఎవరు భరించాలన్నదే. వేరియబుల్ వడ్డీ రేటుతో రుణ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రుణగ్రహీత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు రివార్డ్‌ను పొందుతాడు. ఫిక్స్‌డ్ రేట్ లోన్ లో రుణాన్ని అందించే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అందువల్ల ఫిక్స్‌డ్ రుణాలపై 75 నుంచి 100 పాయింట్ల వరకు అధిక వడ్డీ రేటును బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. వేరియబుల్ వడ్డీ రేట్లు కలిగిన రుణాలకు ప్రస్తుత వడ్డీ రేటు 6.5-7% ఉండగా.. ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు కలిగిన రుణాలకు వడ్డీ రేటు 7.5-7.9% గా ఉంది. రానున్న నెలల్లో మార్టగేజ్ లోన్ వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చన్నది నిజం. అందువల్ల హోమ్ లోన్‌ని ఫిక్స్‌డ్ రేటుకు మార్చటం సమంజసమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కానీ.. మీరు ఫిక్స్‌డ్ రేట్ కి మారడానికి ముందు తద్వారా ఎంత మిగుల్చుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి. గతంలో చెప్పినట్లుగా, ఫిక్స్‌డ్ రేట్ లోన్‌లు అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కాబట్టి.. మారిన తర్వాత మీ సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) పెరుగుతాయి. వ్యత్యాసం 100 వడ్డీ పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే రుణగ్రహీతలకు లాభమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేరియబుల్ వడ్డీ రేట్లు అంతగా పెరగకపోవచ్చు. మీరు కొత్త లోన్‌కి మారినప్పుడు హ్యాండ్లింగ్ ఫీజు, ఇతర రీఫైనాన్సింగ్ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా, ఫైన్ ప్రింట్ మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే వడ్డీ రేటు ప్రారంభ 2-5 సంవత్సరాలు ఫిక్స్‌డ్ గా ఉంటుంది.. ఆ తరువాత అవి వేరియబుల్ వడ్డీ రేట్లలోకి మారతాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ.. దీర్ఘకాలంలో అవి మళ్లీ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి రెండింటి మధ్య ఉండే వేరియేషన్ చూసుకుని వడ్డీ రేటును మార్చుకోవటం లేదా తక్కువ రేటుకు రుణాన్ని అందిస్తున్న మరో బ్యాంక్, ఫైనాన్స్ సంస్థకు లోన్లను మార్చుకోవటం ఉత్తమమైన ఎంపిక అని చెప్పుకోవాలి.