AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త సేవలు.. ప్రారంభం ఎప్పుడంటే..?

ఆధార్ సేవలను మరింత సులభతరంగా ప్రజలు ఉపయోగించే ఏర్పాట్లు యూఐడీఏఐ చేస్తోంది. అందలో భాగంగా త్వరలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఆధార్ సేవా కేంద్రాలను ప్రజలు సులువుగా గుర్తించి సేవలు పొందేలా గూగుల్ సంస్థతో యూఐడీఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త సేవలు.. ప్రారంభం ఎప్పుడంటే..?
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 9:52 PM

Share

భారతదేశంలో నివసించే ప్రతీ వ్యక్తికి ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్. ఇది లేనిది మీరు భారత్‌లో ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేరు. ప్రభుత్వ పథకాలు పొందటం దగ్గర నుంచి హోటల్‌లో చెకింగ్ వరకు ప్రతీ పనికి ఓ గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఇది ఉపయోగపడుతుంది. దీంతో ప్రతీఒక్కరూ నిరంతరం ఎప్పుడూ తమ వెంట ఆధార్‌ను తప్పనిసరిగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధార్‌ సేవలను ప్రజలకు సులువుగా అందించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆధార్ వినియోగదారులకు ఉపయోగపడేలా మరో సదుపాయం ప్రవేశపెట్టింది.

గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ సేవా కేంద్రాలు

కొత్త ఆధార్ కార్డ్ తీసుకోవాలన్నా లేదా ఏవైనా వివరాలు అప్‌డేట్ చేసుకోవాలన్నా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు సులువుగా గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ ఆధార్ సేవా కేంద్రాలను గూగుల్ మ్యాప్స్‌లో పొందుపర్చనుంది. ప్రస్తుతం ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకునే యజమానులు గూగుల్ మ్యాప్స్‌లో తమ వివరాలను పొందుపర్చడం లేదు. ఇక కొంతమంది తప్పుగా వివరాలను ఇస్తున్నారు. దీని వల్ల లొకేషన్స్‌ను గుర్తించడం కష్టతరంగా మారింది. దీనిని పరిష్కరించి ఆధార్ సేవలను వినియోగదారులు సుభతరంగా పొందేలా చేసేందుకు గూగుల్‌తో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ జత కట్టాయి. ఇందులో భాగంగా దేశంలోని ప్రతీ ఆధార్ సేవా సెంటర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో రిజిస్టర్ చేయనున్నారు.

లొకేషన్ మాత్రమే కాదు..

కేవలం లొకేషన్ మాత్రమే కాకుండా ఆధార్ సెంటర్‌లో అందించే సేవలను కూడా ప్రజలు చూసుకోవచ్చు. పిల్లల ఆధార్ సేవలు, పెద్దల ఆధార్ సేవలు, మొబైల్ నెంబర్ అప్డేట్, చిరునామా అప్ డేట్ వంటి సేవలు అందిస్తున్నారా.. లేదా అనే సమాచారం మొత్తం రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. తమ సేవ అవసరానికి అనుగుణంగా ఏ కేంద్రంలో సేవలు దొరుకుతాయా ముందుగా తెలుసుకుని వెళ్లవచ్చు. ఇక సేవా కేంద్రాల టైమింగ్స్, పార్కింగ్ సౌకర్యాలు దివ్యాంగులకు వీల్ చైర్లు వంటి సదుపాయాల గురించి తెలుసుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఆధార్ సెంటర్లను విజిట్ చేసేందుకు ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకునేలా గూగుల్ మ్యాప్స్‌లో అవకాశం కల్పించనుంది. దీని వల్ల ఇంటి వద్ద నుంచే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని ఆ సమయానికి విజిట్ చేయవచ్చు. దీని వల్ల క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది.

Follow Us