Tamil Nadu: మృతదేహాన్ని 15 కిలోమీటర్లు డోలిలో మోసుకెళ్లిన గ్రామస్తులు.. ఈ దారుణానికి తెరపడేదెన్నడు..
Vaniyambadi Road Issue: తిరుపత్తూర్ జిల్లాలో డోలి కష్టాలు వెలుగు లోకి వచ్చాయి. అంబులెన్సు అందుబాటు లో ఉన్నప్పటికి రోడ్డు మార్గం లేకపోవడం తో మృతదేహాన్ని డోలిలో మోసుకెళ్లారు గ్రామస్తులు. తిరుపత్తూర్ జిల్లాలోని అలాంగులం గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూర్ లో చనిపోయాడు. మృతదేహాన్ని అంబులెన్సు లో తీసుకొచ్చారు. అయితే..
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికి ప్రజల కష్టాలు తీరడం లేదు. తమిళనాడు లోని తిరుపత్తూర్ జిల్లాలో డోలి కష్టాలు వెలుగు లోకి వచ్చాయి. అంబులెన్సు అందుబాటు లో ఉన్నప్పటికి రోడ్డు మార్గం లేకపోవడం తో మృతదేహాన్ని డోలిలో మోసుకెళ్లారు గ్రామస్తులు. తిరుపత్తూర్ జిల్లాలోని అలాంగులం గ్రామానికి చెందిన వ్యక్తి బెంగళూర్ లో చనిపోయాడు. మృతదేహాన్ని అంబులెన్సు లో తీసుకొచ్చారు. అయితే వాణియంబాడి నుంచి అలాంగులం గ్రామానికి రహదారి లేకపోవడం తో మృతదేహాన్ని గ్రామస్థులకు అప్పగించారు. డోలి సహాయం తో సుమారు పదిహేను కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకెళ్లారు గ్రామస్థులు. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది , అంబులెన్సు ఉన్నప్పటికి కూడా మృతదేహాన్ని భూజాలపై మోసుకెళ్ళడం ఫై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుమార్గం నిర్మించాలని సీఎం స్టాలిన్‌కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
వాణియంబాడి సమీపంలో 50 ఏళ్లకు పైగా రోడ్డు సౌకర్యం లేని కొండవీటి వాకిలిలో మృత దేహాన్ని డోలీలో మోసుకుపోయిన విషాద ఘటన నేటికీ కొనసాగుతూనే ఉంది. తిరుపతి జిల్లా వాణియంబాడి పక్కన వాకియంబాడి 50 ఏళ్లకు పైగా రోడ్డు సౌకర్యం లేని కొండ గ్రామం. గ్రామంలో 300కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొండ గ్రామాల ప్రజలు ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు.
శరవణన్ వయస్సు 37 సంవత్సరాలు.. బెంగళూరులో పనిచేస్తున్నాడు. అతను తన స్వగ్రామం నెక్నామలైలో ఉన్నాడు. కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామంలో ఖననం చేసేందుకు అంబులెన్స్‌లో తరలించారు. కొండ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు స్వగ్రామంలో తీసిన వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. రకరకాల సాంకేతిక పరిణామాలు చోటుచేసుకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా ఒకరి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఇంతలా కష్టపడే పరిస్థితి రావడం చాలా బాదకరం అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.