AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olectra Greentech: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో భారీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్.. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలోఇదే అతిపెద్ద ఆర్డర్‌

Olectra Greentech: ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ యుగం నడుస్తోంది. పెట్రో సెగల్ని తట్టుకోలేని జనం ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు తాజాగా ..

Olectra Greentech: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో భారీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్.. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలోఇదే అతిపెద్ద ఆర్డర్‌
Subhash Goud
|

Updated on: May 23, 2022 | 7:21 PM

Share

Olectra Greentech: ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ యుగం నడుస్తోంది. పెట్రో సెగల్ని తట్టుకోలేని జనం ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు తాజాగా మరో భారీ ఆర్డర్‌ దక్కింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ దక్కింది. ఈ మేరకు ఎంఈఐఎల్‌ గ్రూపు కంపెనీ అయిన ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ మేరకు బెస్ట్‌ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ను పొందింది ఒలెక్ట్రా సంస్థ. 2100 బస్సుల తయారీ ఆర్డర్‌ విలువ రూ.3 వేల 675 కోట్లు. దేశ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే అతి పెద్ద ఆర్డర్‌. కాంట్రాక్ట్‌ కాలంలో ఈ బస్సుల మెయింటెన్స్‌ బాధ్యతను కూడా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తీసుకుంటోంది. అయితే ఎలక్ట్రిక్‌ మొబిలిటీ హిస్టరీలో ఇదే పెద్ద ఆర్డర్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వైపు అడుగులు పడుతున్నాయి. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (GCC) ఒపెక్స్‌ ప్రాతిపదికన 2100 బస్సులను సరఫరా చేసి వచ్చే 12 ఏండ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈవీ ట్రాన్స్‌ నేరుగా కానీ లేదా స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)తో గానీ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి బస్సులను కొనుగోలు చేస్తుంది. ఈ బస్సులను వచ్చే 12 నెలలలోగా సప్లై చేయాల్సి ఉంటుంది.

ఈవీ ట్రాన్స్‌, ఒలెక్ట్రాల మధ్య జరిగే ఈ లావాదేవీని రిలేటెడ్‌ పార్టీ లావాదేవీగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, కేవి ప్రదీప్‌ మాట్లాడుతూ.. బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్) కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఆర్డర్‌ను పొందడం సంతోషంగా ఉందన్నారు. దేశ ఆర్థిక రాజధానిలో అతి పెద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను నడపబోవడం చాలా గర్వంగా ఉందన్నారు. బస్సులను సకాలంలో షెడ్యూలు ప్రకారం డెలివరీ చేసి ముంబై వాసులకు సౌకర్యవంతమై ప్రయాణ అనుభవాలను అందిస్తామ‌ని పేర్కొన్నారు.

దేశంలో తొలిసారి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ ఈ ఆర్డర్‌ కోసం 12 మీటర్ల ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సులను తయారు చేయనుందన్నారు. ఇప్పటికే బెస్ట్‌ కోసం 40 బస్సులను ముంబైలో నిర్వహిస్తున్నదన్నారు. ఈవీ, ఒలెక్ట్రాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాల రవాణా సంస్థలకు బస్సులను సరఫరా చేసిందని, ప్రస్తుతం ఫూణే, హైదరాబాద్‌, గోవా, డెహ్రాడూన్, సూరత్‌, అహ్మదాబాద్‌, సిల్వాస, నాగ్‌పూర్‌లలో బస్సులను నిర్వహిస్తంద‌న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!