Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రెండు గంటల పాటు ఫ్రీ గా జర్నీ చేసేలా అవకాశం

వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కు చేరుకునే వారు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు పుష్పక్‌ బస్సులను(Pushpak Bus) అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించిందిం. ఇకపై ఈ బస్సులో...

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రెండు గంటల పాటు ఫ్రీ గా జర్నీ చేసేలా అవకాశం
Pushpak Bus
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 23, 2022 | 8:23 PM

వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కు చేరుకునే వారు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు పుష్పక్‌ బస్సులను(Pushpak Bus) అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై ఈ బస్సులో టికెట్‌ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం చేసే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. మరో వారం, పది రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఎయిర్‌పోర్టు(Hyderabad Airport) ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ఈ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం నగరంలోని జేఎన్‌టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు 39 పుష్పక్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఈ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి.

ఎయిర్‌ పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో ప్రయాణికులు వెళ్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ నుంచి బయలుదేరే ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. పుష్పక్‌ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల స్పందన తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190 కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30 కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Shekar: ‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు.. న్యాయస్థానం ఏమన్నదంటే

TELANGANA PARTIES: ఉరకలెత్తే ఉత్సాహంతో తెలంగాణ రాజకీయ పార్టీలు.. మోదీ సెంట్రిక్‌గా బీజేపీ.. రాహుల్ డిక్లరేషన్‌తో టీ.కాంగ్రెస్.. మరి టీఆర్ఎస్?