TSPSC Group 4 Jobs: మరో గుడ్‌న్యూస్‌! జూన్‌ 15 నాటికి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్‌.. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం!

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 (TSPSC Group-4) విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు..

TSPSC Group 4 Jobs: మరో గుడ్‌న్యూస్‌! జూన్‌ 15 నాటికి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్‌.. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం!
Tspsc Group 4
Follow us

|

Updated on: May 24, 2022 | 7:41 AM

TSPSC Group-4 notification Release date 2022: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై దృష్టి సారించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 (TSPSC Group-4) విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (PS) సమీక్ష నిర్వహించారు. గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లు సహా అవసరమైన వివరాలు, సమాచారాన్ని మే 29వ తేదీలోపు టీఎస్‌పీఎస్సీకి అందించాలని ఈ సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.

జూనియర్ అసిస్టెంట్, సమాన స్థాయి పోస్టుల ఖాళీలన్నింటినీ నోటిఫికేషన్‌లో చేర్చాలని, పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు. దీంతో అదనంగా 600 నుంచి 700 పోస్టులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం గ్రూప్-4 పోస్టుల సంఖ్య 9,800 దాటుతుందని అంచనా. ప్రక్రియ పూర్తికి ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని శాఖల అధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పోస్టుల భర్తీకి, వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సీఎస్‌ సూచించారు. ఈ నెల 29 కల్లా రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలు రెడీ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వీటితో పాటు గ్రూప్‌-2కు సంబంధించి 582 పోస్టులు, గ్రూప్‌-3కి సంబంధించి 1373 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టులకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం కంటే.. ఈ రెండు గ్రూపుల్లోని పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ పోస్టుల గురించి జూన్ 4 న స్పష్టత రానుంది. జూన్ 15 తర్వాత నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో