NHAI Recruitment 2022: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌, హిందీ ఆఫీసర్‌ పోస్టుల (Deputy General Manager Posts) భర్తీకి అర్హులైన..

NHAI Recruitment 2022: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Nhai Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2022 | 12:29 PM

NHAI Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌, హిందీ ఆఫీసర్‌ పోస్టుల (Deputy General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌, హిందీ ఆఫీసర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 48 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: లా డిగ్రీ, హిందీలో స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ కమిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీజీఎం (హెచ్‌ఆర్ అండ్‌ అడ్మిన్‌), నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), సెక్టార్‌ 10, ద్వారకా, న్యూఢిల్లీ 110075.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.