DMHO Krishna Recruitment 2022: నెలకు రూ.1,10,000 జీతంతో కృష్ణా జిల్లాలో 126 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో (DMHO, Krishna District) భాగంగా.. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Specialist Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ..
DMHO Krishna District Specialist Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో (DMHO, Krishna District) భాగంగా.. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Specialist Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 126
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, కార్డియాలజిస్టు పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.48,145ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Medical and Health Office, Krishna, Machilipatnam.
దరఖాస్తులకు చివరితేదీ: మే 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.