TS 10th Class Exams 2022: రేపట్నుంచి టెన్త్‌ పరీక్షలు.. 5 నిముషాలు దాటితే పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ! ఈ నిబంధనలు తప్పనిసరి..

తెలంగాణలో రేపట్నుంచి (మే 23) టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేటాయించిన..

TS 10th Class Exams 2022: రేపట్నుంచి టెన్త్‌ పరీక్షలు.. 5 నిముషాలు దాటితే పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ! ఈ నిబంధనలు తప్పనిసరి..
Ts Ssc Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2022 | 2:40 PM

TS 10th class Exams to start from May 23: తెలంగాణలో రేపట్నుంచి (మే 23) టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి 5 నిముషాల గ్రేస్‌ టైమ్‌ ఇచ్చారు. అంటే 9 గంటల 35 నిముషాల తరువాత లోపలకు అనుమతించబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 75,083 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. హాల్‌టికెట్లులేని విద్యార్ధులకు పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు. ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగి అవసరమైన మందులతో సిద్ధంగా ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలవుతుందని, పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేస్తామని పాఠశాల విద్యాశాఖ ఈ సందర్భంగా వివరించింది.

విద్యార్థులు ఈ  కింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి..

ఇవి కూడా చదవండి
  • పరీక్ష కేంద్రం ఎక్కడుందో తల్లిదండ్రుల సహాయంతో చూసుకోవాలి.
  • పరీక్ష కేంద్రంలో కేటాయించిన స్థానంలో కూర్చోవాలి. జవాబుపత్రానికి జతపర్చిన ఓఎంఆర్‌ తనదేనా? కాదా? సరిచూసుకోవాలి.
  • ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ప్రతిపేజీపైనా హాల్‌టికెట్‌ నంబరు రాయాలి.
  • ప్రశ్నపత్రంలో బాగా తెలిసిన జవాబులతో సమాధానాలు రాయడం ప్రారంభించాలి. చేతిరాత స్పష్టంగా ఉండాలి.
  • పరీక్ష కేంద్రంలో భౌతికదూరం పాటించాలి. ట్రాన్స్‌పరెంట్‌ నీటిసీసా, శానిటైజర్‌ తీసుకెళ్లవచ్చు.
  • విద్యార్థులు, సిబ్బంది సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.
  • జవాబుపత్రం, అడిషనల్‌, బిట్‌, మ్యాప్‌, గ్రాఫ్‌షీట్లలో ఎక్కడా హాల్‌టికెట్‌ నంబరు రాయకూడదు.