Telangana SSC Exams 2022: తెలంగాణలో రేపటి నుంచి టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు..

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (మే 23) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 2.15 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు..

Telangana SSC Exams 2022: తెలంగాణలో రేపటి నుంచి టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు..
Ts teacher Exams
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2022 | 2:17 PM

TS 10th class Exams 2022: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (మే 23) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5,09,275ల మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో చోటుచేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. దీంతో పరీక్షలు జరిగే 2,861 పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పరీక్షలకు అరగంట సమయాన్ని అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే. అంటే ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే (మే 12) విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చు.

గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు జరిగేవి. కరోనా నేపథ్యంలో సిలబస్‌ తగ్గించి ఏడు పేపర్లకు కుదించారు. సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రం.. వీటికి రెండు పేపర్లు ఉంటాయి. మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌ చొప్పున పరీక్ష ఉంటుంది. మే 27వ తేదీన సైన్స్‌ పరీక్ష జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.05 గంటల వరకు భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంతోపాటు జవాబుపత్రం ఇస్తారు. దాన్ని 11.05 గంటల నుంచి 11.10 గంటల మధ్యలో తీసుకుంటారు. ఆ వెంటనే 11.10 గంటల నుంచి 12.45 గంటల వరకు జీవశాస్త్రం పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రంతోపాటు మరో జవాబుపత్రం ఇస్తారు.

కాగా ఈ సారి పరీక్షలకు బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘Z’ ఆకారంలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గదులైతే 12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేలా బెంచీలు వేస్తున్నారు. మండుటెండల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖాధికారులు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.