Sheena Bora murder case: కూతురు హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీం బెయిల్.. త్వరలో బుక్ రాస్తున్నాను!
కన్న కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా సంచలనం రేపిన మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా (50)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. 2015 నుంచి ముంబై జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీయా (Indrani Mukerjea)కి సీబీఐ ప్రత్యేక కోర్టు పదే పదే బెయిల్ నిరాకరించినా..
Here’s All About Sheena Bora Murder Case: కన్న కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా సంచలనం రేపిన మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా (50)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. 2015 నుంచి ముంబై జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జీయా (Indrani Mukerjea)కి సీబీఐ ప్రత్యేక కోర్టు పదే పదే బెయిల్ నిరాకరించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరున్నరేళ్లు జైలు జీవితం గడిపినందున, బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఐతే దేశం విడిచి వెళ్లకూడదు, సాక్షులను సంప్రదించకూడదనే షరతులతో కూడిన అనుమతితో ఈరోజు సాయంత్రం (మే 20) ముంబాయిలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది. మే 19న విడుదల కావల్సి ఉండగా పేపర్ వర్క్ సకాలంలో పూర్తి కాకపోవడంతో నిన్నటి విడుదల నేటికి వాయిదా పడింది.
చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటికి రాగానే మొదటిగా అన్న మాటలు..
“నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కేసు గురించి ప్రస్తుతం మాట్లాడను. నన్ను బాధపెట్టిన వారినందరినీ క్షమించాను. జైలులో గడిపిన కాలంలో నేను చాలా నేర్చుకున్నాను. ఆరున్నరేళ్లతర్వాత బయటి ప్రపంచాన్ని చూశాను. ఏం చెయ్యాలన్నది తర్వాత ఆలోచిస్తానని, తాను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నానని, అది జైలులో గడిపిన జీవితం గురించి కాదని” ఇంద్రాణి ముఖర్జియా మీడియాకు తెల్పింది.
ఎవరీ ఇంద్రాణి ముఖర్జియా..
ముగ్గురు భర్తల ఇంద్రాణికి.. మొదటి భర్తతో కలిగిన సంతానమే షీనా బోరా, మైఖేల్. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత కూతురు, కొడుకును గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, ఆ తర్వాత సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. పీటర్ ముఖర్జీ మొదటి భార్య కుమారుడైన రాహుల్ ముఖర్జీతో షీనా బోరాకు నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది.
పక్కాప్లాన్‌తో.. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ సాయంతో షీనాను 2012 ఏప్రిల్‌లో కారులో హత్య చేసింది. మృతదేహం రాయ్‌గడ్ జిల్లాలోని అడవిలో పారవేశారు. హత్య 2012లో జరిగినప్పటికీ మూడేళ్ల వరకు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. ఈ హత్య జరిగిన మూడేళ్ల తర్వాత 2015లో ఒక కేసులో డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరా కేసులో శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారి, షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపిందని.. డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.. ఆ తర్వాత ఆగస్టులో ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను కూడా ఈ కేసులో సహకరించాడనే ఆరోపణలతో 2015 నవంబర్ 19లో అరెస్టయ్యాడు. ఐతే 2020లో ముంబై హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైల్లో ఉండగానే ఇంద్రాణి, పీటర్ ముఖర్జీ వారి 17 సంవత్సరాల బంధానికి ముగింపుపలికారు. 2019లో విడాకులు తీసుకున్నట్లు ఇరువురూ ప్రకటించారు.
నా కూతురు బతికే ఉందంటూ డ్రామాలు.. షీనా కనబడకుండా పోయిన తర్వాత.. మొదట్లో షీనా బోరా ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లిపోయిందని స్నేహితులు, కుటుంబ సభ్యులకు నమ్మబలికింది ఇంద్రాణి. ఆ తర్వాత రాహుల్ పదేపదే వేధిస్తున్నాడని, ఫోన్‌లో అతనికి బ్రేక్‌అప్ మెసేజ్ కూడా పంపినట్లు వార్తలు బయటికి వచ్చాయి. అంతా ప్లాన్ ప్రకారంగా జరిగినా.. డ్రైవర్ మూలంగా ఇంద్రాణి అరెస్టు అయ్యింది. హత్యకు పాల్పడినవారిని, ప్లాన్‌లో పాలుపంచుకున్నవారు నేరాన్ని అంగీకరించారని తెలుసుకున్న ఇంద్రాణి 2016లో తన కుమార్తెను హత్య చేసినట్లు అంగీకరించింది.
హత్యకు కారణం ఇదేనా..? షీనా తన సవతి సోదరుడు రాహుల్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉందని, ఇది నచ్చని పీటర్, ఇంద్రాణి, సంజీవ్‌లు షీనా హత్యకు 2012 ఏప్రిల్‌లో కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. సీబీఐ విచారణలో ఈ హత్య ఆర్థిక సమస్యలతో పాటు షీనాకు- రాహుల్‌తో ఉన్న సంబంధాన్ని అంగీకరించలేని ఇంద్రాణి హత్యకు పాల్పడినట్లు పేర్కొంది.