BRO MSW Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 876 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) పరిధిలోని బోర్డర్‌ రోడ్స్‌ వింగ్‌-జనరల్‌ రిజర్వ్‌ ఇంజనీర్‌ ఫోర్స్‌ విభాగంలో.. స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజన్‌ స్టాటిక్‌) పోస్టుల (Store Keeper Technical Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BRO MSW Recruitment 2022: బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 876 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు..
Border Roads Organization
Follow us

|

Updated on: May 20, 2022 | 7:26 PM

BRO MSW Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) పరిధిలోని బోర్డర్‌ రోడ్స్‌ వింగ్‌-జనరల్‌ రిజర్వ్‌ ఇంజనీర్‌ ఫోర్స్‌ విభాగంలో.. స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజన్‌ స్టాటిక్‌) పోస్టుల (Store Keeper Technical Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 876

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ పోస్టులు: 377
  • మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజన్‌ స్టాటిక్‌) పోస్టులు: 499

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీసీ/మహిళా అభ్యర్ధులకు: రూ.50
  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ఈడబ్ల్యూఎస్/పీహెచ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.