SCCL Clerk Notification: సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 155 క్లర్క్‌ (Junior Assistance Grade II) పోస్టుల భర్తీకి గురువారం (మే 20) నోటిఫికేషన్ విడుదల చేసింది...

SCCL Clerk Notification: సింగరేణిలో 155 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..
Sccl
Follow us
Srilakshmi C

|

Updated on: May 20, 2022 | 3:01 PM

SCCL issues notification to fill 155 clerk posts: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 155 క్లర్క్‌ (Junior Assistance Grade II) పోస్టుల భర్తీకి గురువారం (మే 20) నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో ఇప్పటికే వర్కర్లుగా పనిచేస్తు్న్న అర్హులైన బద్లీ వర్కర్లు, ఇతర కేటగిరీలకు చెందిన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమవుతుంది. జూన్‌ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిల్‌ చేసిన దరఖాస్తుల హార్డు కాపీలను జూన్‌ 25 లోపు సంబంధిత రిక్రూట్‌మెంట్‌ సెల్‌కు పంపించాలి. కాగా భర్తీ చేయనున్న 155 పోస్టులలో 95 శాతం పోస్టులను సింగరేణి పనులు జరుగుతున్న 4 జిల్లాలలోని ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులకు, మిగిలిన 5 శాతం పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతున్న అభ్యర్థుల ద్వారా భర్తీ చేస్తారు.

ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలో 85 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 15 మార్కులకు అసెస్‌మెంట్‌ నివేదిక ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా తుది మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. అండర్‌ గ్రౌండ్‌ వర్కర్లలో ఏడాదికి 190 మస్టర్లు పూర్తి చేసినవారు, ఉపరితల (surface workers) వర్కర్లలో ఏడాదికి 240 మస్టర్లు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆరు నెల్ల సర్టిఫికేషన్‌తోపాటు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్స్‌లో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.