AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS inter exams 2022: జూన్ 20వ తేదీలోపు తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల పలితాలు..!

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్య వైకరిపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ (Omer Jaleel) గురువారం (మే 19) తన కార్యాలయంలో మీడియాతో..

TS inter exams 2022: జూన్ 20వ తేదీలోపు తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల పలితాలు..!
Ts Inter Results 2022
Srilakshmi C
|

Updated on: May 19, 2022 | 8:33 PM

Share

Telangana Intermediate Result date 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్య వైకరిపై సర్వత్రా విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ (Omer Jaleel) గురువారం (మే 19) తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన విషయం వాస్తమే. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, వాల్యుయేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జూన్ 20 లోపుగా వెల్లడించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు.

గందరగోళంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన (మే 6) తొలిరోజు ఫస్టియర్‌ సంస్కృతం పేపర్‌లో రెండు ప్రశ్నలు రిపీటవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరుసటిరోజు జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రెండో ఏడాది సంస్కృతం బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు. మరొకరికి హిందీకి బదులు సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చారు.

చేతితో రాసిన క్వశ్చన్‌ పేపర్లతో విద్యార్ధుల పాట్లు మే 11న హైదరాబాద్‌, నిజామాబాద్‌లలో జరిగిన ఇంటర్ ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు బోర్డు ద్వారా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా చేతితో రాసిన క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. హిందీ మీడియం పేపర్లు లేకపోవడంతో ఇంగ్లీష్ మీడియం పేపర్లను ట్రాన్స్ లేటర్‌తో హిందీలో రాయించారు. దాన్ని జీరాక్స్ తీయించి విద్యార్థులకు ఇచ్చారు. అయితే విద్యార్థులకు చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని ఆవేదన చెందారు. ఐతే చేతితో రాసిన క్వశ్చన్‌ పేపర్లు ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆప్షనల్‌ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని చెప్పటం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6న, సెకండియర్‌ పరీక్షలు మే 7న ప్రారంభమయ్యాయి. మొత్తం 1443 పరీక్షా కేంద్రాల్లో 9.07 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 23న, సెకండియర్‌ పరీక్షలు మే 24న ముగియనున్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చే నెల 20 లోపు విడుదల చేయనున్నట్లు బోర్డు తాజాగా ప్రకటించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.