NEET UG 2022: నీట్‌-2022 వాయిదా కోరుతూ 10 వేల మంది విద్యార్ధుల లేఖ.. మా కలలు తుంచేయొద్దు!!

నిన్న నీట్ పీజీ విద్యార్ధులు.. నేడు నీట్ యూజీ విద్యార్ధులు. పరీక్షలు వాయిదా వేయాలంటూ వేలాది విద్యార్ధుల ఆవేదనను పట్టించుకోని కేంద్రం.. దాదాపు పది వేల మంది ఎంబీబీఎస్‌ ఆశావహ విద్యార్ధుల గోడు వినేదిక్కేది?..

NEET UG 2022: నీట్‌-2022 వాయిదా కోరుతూ 10 వేల మంది విద్యార్ధుల లేఖ.. మా కలలు తుంచేయొద్దు!!
Neet Ug 2022
Follow us

|

Updated on: May 19, 2022 | 4:02 PM

NEET 2022 Postponed or not: నీట్ 2022 మెడికల్ ప్రవేశ పరీక్ష తేదీ ఇతర పోటీ పరీక్షలకు చాలా దగ్గరగా ఉన్నందున దానిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ 10,000 మందికి పైగా ఎంబీబీఎస్‌ ఆశావహ విద్యార్ధులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి లేఖ రాశారు. ఈ ఏడాది జులై 17న పరీక్ష జరగాల్సి ఉంది. గత ఏడాదికి సంబంధించిన నీట్‌ 2021 కౌన్సెలింగ్ పూర్తి కాకుండానే, ఈ ఏడాది నీట్‌ 2022 తేదీని ఎన్టీఏ ప్రకటించింది. ఈ పరీక్షల ఆశావహులు చాలామంది నీట్‌ 2021 కౌన్సెలింగు తుదివరకూ (మాప్‌-అప్‌ రౌండు) మెడికల్‌ సీటు లభిస్తుందనే ఆశతో ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. ఈ రౌండు ఏప్రిల్‌ మొదటివారంలో ముగిసింది.

కొన్ని రాష్ట్రాల్లో స్టేట్‌ కౌన్సెలింగు ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాకుండా నీట్‌ 2021 కౌన్సెలింగు నుంచి రిజర్వేషన్‌ విధానం మారటంతో ఈ ఏడాది చాలామంది విద్యార్థులు సీటు పొందేందుకు అనువైన పర్సంటేజీ గణాంకాలను కూడా సరిచూసుకోలేదు. అనేక రాష్ట్రాల్లో స్టేట్‌ కౌన్సెలింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ మొదటివారంలో కౌన్సెలింగు ముగియగానే.. ఆ తర్వాత 3 రోజులకు (ఏప్రిల్ 6న) జూలై 17 న నీట్ 2022న నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందని విద్యార్థులు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక మంది డ్రాపర్లు, ఫ్రెషర్లకు నీట్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించలేదు.

గత ఏడాది నీట్‌ ప్రవేశ పరీక్షను తొలుత ఆగస్టు 1న నిర్వహించాలని నిర్ణయించారు. ఐతే కోవిడ్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా దానిని సెప్టెంబర్ 12కి వాయిదా వేశారు. ఈ సంవత్సరం CUET పరీక్ష జూలై 1, 2 వారాల్లో నిర్వహించడానికి షెడ్యూల్‌ ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ సెకండ్‌ అటెంప్ట్ జూలై 21న జరగనుంది. ఈ పరీక్షల మధ్యలో జూలై 17న నీట్‌ పరీక్షను రాయడం విద్యార్థులకు కష్టమవుతుంది. ఎంబీబీఎస్‌ చదవడమనేది లక్షలాది విద్యార్ధులు, వారి తల్లదండ్రుల కల. ఈ విధమైన పరీక్షల షెడ్యూల్‌ కారణంగా తమ కల నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. దయచేసి వారంతా పరీక్షలకు సిద్ధమవడానికి తగిన సమయం కేటాయించాలని, అసంబద్ధ చర్యలతో మా కలను మధ్యలోనే తుంచివేయొద్దని అభ్యర్ధిస్తూ లేఖలో పేర్కొన్నారు. కాగా నీట్ పీజీ 2022 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. మే 21 తేదీన జరగవల్సిన పరీక్ష తేదీలో ఏదైనా మార్పు చేస్తే విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి లోపం ఏర్పడుతుందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యా్‌ఖ్యానించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి