ICMR – NARI Recruitment 2022: రూ.68,875లజీతంతో ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

ICMR - NARI Recruitment 2022: రూ.68,875లజీతంతో ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
Icmr Nari

భారత ప్రభుత్వరంగానికి చెందిన పూణెలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ICMR - NARI).. ఒప్పంద ప్రాతిపదికన కూపన్ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, సైంటిస్ట్‌-బి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Coupon Manager Posts) భర్తీకి..

Srilakshmi C

|

May 18, 2022 | 8:36 PM

ICMR – NARI Coupon Manager Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన పూణెలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ICMR – NARI).. ఒప్పంద ప్రాతిపదికన కూపన్ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, సైంటిస్ట్‌-బి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల (Coupon Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: కూపన్ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, సైంటిస్ట్‌-బి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.16,000ల నుంచి రూ.68,875ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu