SRMIST record: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మెరిసిన ఎస్‌ఆర్‌ఎమ్ స్టూడెంట్.. రూ.కోటి వేతనంతో అమెజాన్ జాబ్ ఆఫర్!
ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పురంజయ్ మోహన్ (Puranjay Mohan) ఏకంగా రూ. 1,00,00,000ల ప్యాకేజీతో అమెజాన్ (Amazon Germany)లో ఉద్యోగం సంపాదించాడు. ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్లలో ఇప్పటివరకు..
Over 10K students get job offers at SRMIST: ఈ ఏడాది (2021-22) ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కోటి రూపాయల వార్షిక వేతనంతో ప్రముఖ కంపెనీలో జాబ్ సాదించాడు. ఇది తమ ఇన్‌స్టిట్యూట్ చరిత్రలోనే అత్యున్నత విజయమని యాజమాన్యం ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకెళ్తే..
చెన్నైలోని కట్టంకులత్తూర్‌లోనున్న ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SRMIST) క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 1,050 కంపెనీల నుంచి 10,000 కంటే ఎక్కువ ఆఫర్లు వచ్చనట్లు తెల్పింది. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పురంజయ్ మోహన్ (Puranjay Mohan) ఏకంగా రూ. 1,00,00,000ల ప్యాకేజీతో అమెజాన్ (Amazon Germany)లో ఉద్యోగం సంపాదించాడు. ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్లలో ఇప్పటివరకు అందించిన అత్యధిక ప్యాకేజీ ఇదేనని SRMIST వైస్-ఛాన్సలర్ సి ముత్తమిజ్‌చెల్వన్ మీడియాకు తెలిపారు. దాదాపు 4,000 మంది విద్యార్థులు సంవత్సరానికి రూ.10 లక్షల వేతనంతో జాబ్‌లు పొందారు. 5,200 మంది విద్యార్ధులు ఏడాదికి రూ.5 లక్షల వేతనంతో బంపర్ ఆపర్లను చేజిక్కించుకున్నట్లు తెలియజేశారు. అమెజాన్, పేపాల్, గూగుల్, ఎల్‌అండ్‌టి కన్‌స్ట్రక్షన్, హోండా, ఐబీఎం ఎయిర్ ఏషియా, వాల్‌మార్ట్, టిసిఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఆల్‌స్టామ్, హిటాచీ వంటి టాప్ కంపెనీల నుంచి ఈ ఆఫర్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.
SRMIST ఛాన్సలర్ టీఆర్ పారివేంధర్ మాట్లాడుతూ..
గత 3 ఏళ్లుగా ఇన్‌స్టిట్యూట్ ప్లేస్‌మెంట్లు మెరుగుపడుతూ వస్తున్నాయి. 2019-20లో సుమారు 7,000 మంది విద్యార్థులు ఎంపికవగా, 2020-21లో 8,000, 2021-22లో 10,000 మంది విద్యార్ధులు సెలక్టయ్యారన్నారు. అత్యధిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకున్న మోహన్ ఇతర విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలుస్తాడని పేర్కొన్నారు. మోహన్ చదువుతున్న కోర్సు కంప్యూటర్ సైన్స్ కాదని, అతను ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ అవ్వడం మూలంగానే అమెజాన్‌లో జాబ్ కొట్టగలిగాడని ఆయన అన్నారు.
ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పురంజయ్ మోహన్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
సంస్థ అందించిన శిక్షణ, సీనియర్ స్టూడెంట్స్ అందించిన మార్గదర్శకత్వం తన విజయానికి కారణమని మోహన్ అన్నాడు.12వ తరగతి తర్వాత కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండింటిలోనూ ఆసక్తి ఉన్నప్పటికీ.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎంచుకుని, దానిని చదువుతూనే కంప్యూటర్ సైన్స్ ను అదనంగా (స్వతహాగా) చదివానని మోహన్ తెలిపాడు. సక్సెస్ సాధించాలంటే సాంకేతిక నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మూడు ఆయుధాలు అవసరమని.. తన విజయ రహస్యాన్ని తెలియజేశాడు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.