AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి.. ఎందుకంటే?

విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకోవడం ఇటీవల అనేక చోట్ల జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఒకవైపు పోలీసులు కరోడా ఝలుపిస్తుంటే.. మరోవైపు రోడ్డు మీద వీధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు కొందరు పోకిరీలు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

Hyderabad: రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి.. ఎందుకంటే?
Hyd News
Vijay Saatha
| Edited By: Anand T|

Updated on: Dec 05, 2025 | 6:51 PM

Share

జవాహర్‌నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ గురువారం విధుల్లో ఉండగా ఓ బైక్ రైడర్ వింతగా ప్రవర్తించాడు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేశాడు. రాంగ్ రూట్‌లో వచ్చి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. తనపై ముందే చలాన్ వేసిందని ఆగ్రహంతో ఉన్న ఆ వ్యక్తి, ఆమెను “నా సంపాదన అంతా మీకే ఇవ్వాలా?” అంటూ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు.

కానిస్టేబుల్‌ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించగా, రైడర్ ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, వీఎచ్‌ఎఫ్ సెట్స్‌ను లాక్కొని నేలకేసి కొట్టేశాడు. దీంతో అవి దెబ్బతిన్నాయి. అంతే కాదు, సదురు వ్యక్తి తన చేతిని మడిచాడని కానిస్టేబుల్‌ ఆరోపించింది. బాధితురాలు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో విధుల్లో యూనిఫాం ధరించిన అధికారిపై దాడి చేసినందుకు కీసర పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

మరో వైపు హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ లో మహిళలను వేధించందం, పబ్లిక్‌లో మద్యం సేవించడం, ప్రజా శాంతిభద్రతకు భంగం వంటి కేసుల్లో అరెస్టు చేసిన 22 మందికి కోర్టు ప్రత్యేకంగా శిక్ష విధించింది. గురువారం కోర్టు ఆదేశాల మేరకు వారిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో కమ్యూనిటీ సర్వీస్ చేయించేందుకు పంపారు పోలీసులు.

నగరంలో మహిళల వేధింపులను అరికట్టడం, రోడ్లపై మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్, వీధి నేరాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. ఈ చర్యల భాగంగానే పలువురిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్