IRFC Recruitment 2022: ఆకర్షణీయమైన జీతంతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC).. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (Executive Director Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..
IRFC Executive Director Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC).. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (Executive Director Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
మొత్తం పోస్టులు: 3
విభాగాలు: ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.3,00,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Joint General Manager (HR & Admin), 3rd Floor, Indian Railway Finance Corporation Limited, The Ashok, Diplomatic Enclave: 50-B, Chanakyapuri, New Delhi – 110021
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.