TS TET 2022 Exam Date: జూన్‌ 12న తెలంగాణ టెట్‌ పరీక్ష నిర్వహణ యథాతథం.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ఎప్పటినుంచంటే..

జూన్‌ 12న తెలంగాణ టెట్‌ పరీక్ష నిర్వహణ యథాతథంగా జరుగుతుందని, పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని మంత్రి ..

TS TET 2022 Exam Date: జూన్‌ 12న తెలంగాణ టెట్‌ పరీక్ష నిర్వహణ యథాతథం.. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ఎప్పటినుంచంటే..
Ts Tet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2022 | 10:00 AM

TS TET to be conducted on June 12: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022)లో ఈసారి రెండు పేపర్లు రాసేవారే అధిక సంఖ్యలో ఉన్నారు. పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు బీఈడీ అభ్యర్ధులకు కూడా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పేపర్‌ 1, పేపర్‌ 2లకు కలిపి మొత్తం 3,79,101 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు కూడా త్వరాలోనే విడుదల కానున్నాయి. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఐతే అదే రోజున రైల్వే ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటన విడుదలైంది. దీంతో ఆర్‌ఆర్‌బీ పరీక్షకు కూడా హాజరయ్యే విద్యార్ధుల్లో గుబులు ప్రారంభమైంది. ఒకేరోజు రెండు పరీక్షలకు ఎలా హాజరవ్వాలన్న సందేహంతో తలలు పట్టుకున్నారు. ఈ విషయమై విద్యాశాఖ స్పష్టత నిచ్చింది. జూన్‌ 12న తెలంగాణ టెట్‌ పరీక్ష నిర్వహణ యథాతథంగా జరుగుతుందని, పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని మంత్రి తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వాయిదావేయాలన్న ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నట్లు మంత్రి సబితా వెల్లడించారు. ఈ మేరకు టెట్‌ అభ్యర్ధులకు విద్యాశాఖ తెలియజేసింది. దీంతో పరీక్ష ముందుగా ప్రకటించిన తేదీ నాడే జరగనుంది. అనంతరం వీటి ఫలితాలు అదే నెలలో 27న విడుదలవ్వనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.