SBI Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 642 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలానే..
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఒప్పంద ప్రాతిపదికన ఛానెల్ మేనేజర్ పోస్టుల (Channel Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
SBI Channel Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ఒప్పంద ప్రాతిపదికన ఛానెల్ మేనేజర్ పోస్టుల (Channel Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 642
పోస్టుల వివరాలు: ఛానెల్ మేనేజర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్–ఎనీటైమ్ ఛానెల్స్ (CMF-AC) పోస్టులు: 503
- ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్–ఎనీటైమ్ ఛానెల్స్ (CMS-AC) పోస్టులు: 130
- సపోర్ట్ ఆఫీసర్-ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులు: 8
పేస్కేల్:
- ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ పోస్టులకు నెలకు రూ. 36,000
- ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ (CMS) పోస్టులకు నెలకు రూ. 41,000
- సపోర్ట్ ఆఫీసర్-ఎనీటైమ్ ఛానెల్స్ (SO-AC) పోస్టులకు నెలకు రూ. 41,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 63 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: ఐటీ/కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏటీఎమ్ పనిలో అనుభవం ఉన్న రిటైర్డ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.