AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 1 Jobs 2022: నిరుద్యోగులకు గమనిక! తెలంగాణ గ్రూప్‌-1, యూనీఫాం పోస్టులకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు..

తెలంగాణలో గ్రూప్‌-1, యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లోని డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ జైలర్‌ (DSJ), సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (AES) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి..

TSPSC Group 1 Jobs 2022: నిరుద్యోగులకు గమనిక! తెలంగాణ గ్రూప్‌-1, యూనీఫాం పోస్టులకు వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు..
Tslprb Age Limit
Srilakshmi C
|

Updated on: May 22, 2022 | 2:59 PM

Share

Telangana Increases Upper Age Limit For Police, Fire Service Recruitments 2022: తెలంగాణలో గ్రూప్‌-1, యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లోని డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ జైలర్‌ (DSJ), సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (AES) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టుల ఎత్తులోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. పురుష అభ్యర్థుల ఎత్తును 167.6 సెం.మీ. నుంచి 165 సెం.మీ.కు, మహిళా అభ్యర్థులకు 152.5 సెం.మీ. నుంచి 150 సెం.మీ.కు తగ్గించినట్లు వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 22 నాటికి గ్రూప్‌-1కు 1,74,938 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ యూనిఫాం పోస్టులకు సైతం వయోపరిమితి పెంపు కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు (2022, జులై 1 నాటికి) కాగా సాధారణ కేటగిరీలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. నోటిఫికేషన్‌ సందర్భంలో మూడేళ్ల సడలింపు ఇవ్వడంతో గరిష్ఠ వయసు 25 అయింది. తాజాగా మరోమారు రెండేళ్ల సడలింపు ఇవ్వడంతో అది 27 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు మరో అయిదేళ్లు సడలింపు ఉన్న నేపథ్యంలో గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లకు పెరిగింది. ఎస్సై ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 21 సంవత్సరాలు (2022, జులై 1 నాటికి) కాగా సాధారణ కేటగిరీరిలో గరిష్ఠ వయోపరిమితి 25గా ఉంది. అది ఇప్పుడు 30 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లుగా మారింది. డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 ఏళ్లు కాగా (2022, జులై 1 నాటికి).. సాధారణ కేటగిరీలో గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్లుగా ఉంది. ఇప్పుడది 33 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 33 నుంచి 38 ఏళ్లకు పెరుగుతుంది.

కాగా పోలీస్‌ నియామక మండలి మొత్తం 17 వేలకు పైగా పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై, రవాణా, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీచేస్తున్న విషయం విదితమే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారందరికీ సడలింపు వర్తిస్తుంది. పొరుగు రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రంలో యూనిఫాం పోస్టులకు వయోపరిమితి నిర్ణయించాలంటున్న నిరుద్యోగుల డిమాండ్‌ మేరకు రెండేళ్ల వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత అమలవుతోందని, రెండేళ్లుగా కరోనా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని యువతకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వయోపరిమితిని పొడిగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.