THSTI Recruitment 2022: పీజీ అర్హతతో.. ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI).. ఒప్పంద ప్రాతిపదికన హెడ్ రెగ్యులేటరీ సైన్స్ అండ్ మెడికల్ అఫైర్స్ పోస్టుల (Head Regulatory Science and Medical Affairs Post) భర్తీకి..
THSTI Faridabad Head Regulatory Science and Medical Affairs Recruitment 2022: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI).. ఒప్పంద ప్రాతిపదికన హెడ్ రెగ్యులేటరీ సైన్స్ అండ్ మెడికల్ అఫైర్స్, హెడ్ ట్రైనింగ్, టీమ్ లీడ్-డేటా సైన్స్ పోస్టుల (Head Regulatory Science and Medical Affairs Post) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: హెడ్ రెగ్యులేటరీ సైన్స్ అండ్ మెడికల్ అఫైర్స్, హెడ్ ట్రైనింగ్, టీమ్ లీడ్-డేటా సైన్స్, టీమ్ లీడ్-ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 1,10,000ల నుంచి రూ.1,65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీహెచ్‌డీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/ఎండీ/తత్సమాన, బీడీఎస్/బీహెచ్ఎంఎస్/బీఏఎంఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ. 590
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 118
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.