BBJ Construction Jobs 2022: బీఈ/ బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! 2 లక్షల జీతంతో బీబీజే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాలోని బ్రెత్‌వైట్‌ బర్న్‌ అండ్‌ జోసప్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (BBJ).. డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టుల (Deputy Manager Post) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

BBJ Construction Jobs 2022: బీఈ/ బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! 2 లక్షల జీతంతో బీబీజే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగాలు..
Bbj Construction
Follow us
Srilakshmi C

|

Updated on: May 23, 2022 | 9:42 AM

BBJ Construction Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌కతాలోని బ్రెత్‌వైట్‌ బర్న్‌ అండ్‌ జోసప్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (BBJ).. డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టుల (Deputy Manager Post) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టులు

విభాగాలు: ఇంజినీరింగ్‌, ప్రాజెక్ట్‌, పర్చెజ్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:

  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టులకు బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 18 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 90,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • జనరల్‌ మేనేజర్ పోస్టులకు బీఈ/ బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 70,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: bhattacharjee@bbjconst.com

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.