Mango Store Tips: మామిడి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఇలా చేయండి..

ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. మామిడి(Mango) ఆహార ప్రియులు ఏడాది పొడవునా వేసవి కోసం వేచి ఉంటారు. వేసవిలో మామిడి పండ్లను తినడానికి ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది మామిడి పండ్లను పెద్దమొత్తంలో

Mango Store Tips: మామిడి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఇలా చేయండి..
Mango Prices Hike
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2022 | 5:26 PM

మామిడి ( Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. మామిడి(Mango) ఆహార ప్రియులు ఏడాది పొడవునా వేసవి కోసం వేచి ఉంటారు. వేసవిలో మామిడి పండ్లను తినడానికి ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది మామిడి పండ్లను పెద్దమొత్తంలో కొని తెచ్చుకుంటారు. కొంత మంది కూరగాయల మార్కెట్ నుంచి కేవలం 20-30 కిలోల మామిడి పెట్టెలను మాత్రమే ఇంటికి తెచ్చుకుంటున్నారు. అయితే, చాలా మామిడి పండ్లను నిల్వ చేయడం కూడా చాలా కష్టం. కొందరికి మామిడి పండ్ల చల్లని రుచి ఇష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి పండ్లను ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటారు, అయితే మామిడికాయలను ఫ్రిజ్‌లో ఉంచడం తప్పు అని మీకు తెలుసా. ఇది మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల మామిడిలో పోషక విలువలు, రుచి రెండూ తగ్గిపోతాయి. మామిడిని ఎక్కడ, ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుందాం.

మామిడిని ఎలా నిల్వ చేయాలి?   

  1. మీ దగ్గర మామిడి కాయలు ఉంటే వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకండి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి బాగా పండవు, రుచి కూడా దెబ్బతింటుంది.
  2. మామిడిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఇది మామిడిపండ్లను మరింత తీపిగా, మెత్తగా చేస్తుంది.
  3. మామిడి పూర్తిగా పండిన తర్వాత తినడానికి ముందు కాసేపు చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
  4. పండిన మామిడిని 5 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.
  5. మామిడిని త్వరగా పండించాలనుకుంటే.., గది ఉష్ణోగ్రత వద్ద పేపర్ బ్యాగ్‌లో ఉంచి ఉంచండి. దీంతో మామిడికాయలు త్వరగా మాగుతుంది.
  6. మామిడి పండ్లను నిల్వ చేయాలనుకుంటే వాటి తొక్క, వాటిని కత్తిరించి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. మీరు వాటిని 6 నెలల వరకు ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు.
  7. చాలా సార్లు.. ఫ్రిజ్‌లో ఖాళీ లేనప్పుడు.. మామిడి పండ్లను ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి ఉంచుతారు.. అస్సు ఇలా చేయవద్దు.
  8. ఇతర పండ్లు, కూరగాయలతో మామిడిని ఉంచడం వల్ల రుచిలో కూడా తేడా ఉంటుంది.

మామిడి.. క్యాన్సర్‌ నివారిణి

మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికడుతుందని మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.

మామిడితో గ్లూకోజు అదుపు..

చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగు పడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపు చేయటానికీ తోడ్పడు తున్నట్టూ బయటపడింది. రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది.

అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి అని అధ్యయన నేత డాక్టర్‌ లూకాస్‌ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్‌ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్‌ రొమ్ముల్లోని క్యాన్సర్‌, క్యాన్సర్‌ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్