Free Ola Scooter: ఓలా స్కూటర్ ఫ్రీగా కావాలా..? కేవలం 10 మందికే అవకాశం.. ఎలా పొందాలంటే..

Free Ola Scooter: ఓలా స్కూటర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. గొప్ప శ్రేణి, శక్తివంతమైన ఫీచర్లు, అందమైన రంగులతో అందుబాటులో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Free Ola Scooter: ఓలా స్కూటర్ ఫ్రీగా కావాలా..? కేవలం 10 మందికే అవకాశం.. ఎలా పొందాలంటే..
Ola Scooter Free
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 23, 2022 | 9:32 PM

Free Ola Scooter: ఓలా స్కూటర్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. గొప్ప శ్రేణి, శక్తివంతమైన ఫీచర్లు, అందమైన రంగులతో అందుబాటులో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీ వాసులు కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఓలా ఎలక్ట్రిక్ విండో తెరుచుకుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా ఎలక్ట్రిక్ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభించింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఓలా స్కూటర్‌ను ఉచితంగా గెలుచుకునేందుకు ఒక ఆఫర్ ప్రకటించారు. మీరు కూడా ఓలా స్కూటర్‌ను ఉచితంగా పొందాలనుకుంటే.. దాని కోసం ఒక పని చేయాలి. అదేంటంటే ఓలా స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్లు నడపాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ కింద మెుత్తం 10 ఓలా స్కూటర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. దీని కోసం పోటీలో పాల్గొనే వారు ఒక్కసారి ఛార్జింగ్‌తో స్కూటర్‌ను 200 కిలోమీటర్లు నడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు ఈ ఛాలెంజ్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. వారికి బహుమతిగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇప్పటికే అందించారు. ఈ ఛాలెంజ్ కింద ఇంకా 8 స్కూటర్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు భవిష్ మరో 10 మంది కస్టమర్లకు ఓలా స్కూటర్‌ను ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారు. అదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఓలా కొనుగోలు విండో మే 21 నుంచి తిరిగి తెరిచింది. Ola S1, S1 ప్రో మోడళ్లను ఈ విండో కింద కంపెనీ అమ్ముతోంది. కస్టమర్లు తమ ఆర్డర్లను బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధరను రూ.10,000 మేర కంపెనీ పెంచింది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే 181 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!