AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steel Prices: గృహ నిర్మాణ దారులకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తగ్గిన ఉక్కు ధరలు.. టన్నుకు ఎంతంటే..

Steel Prices: దేశీయ మార్కెట్‌లో నిరంతరం పెరుగుతున్న స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను సంబంధిత చర్యల కారణంగా ఉక్కు ధరలు 10-15 శాతం తగ్గనున్నాయి.

Steel Prices: గృహ నిర్మాణ దారులకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తగ్గిన ఉక్కు ధరలు.. టన్నుకు ఎంతంటే..
Steel Prices
Ayyappa Mamidi
|

Updated on: May 23, 2022 | 8:01 PM

Share

Steel Prices: దేశీయ మార్కెట్‌లో నిరంతరం పెరుగుతున్న స్టీల్ ఉత్పత్తుల ధరలు చల్లారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను సంబంధిత చర్యల కారణంగా ఉక్కు ధరలు 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమల విభాగం ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) సోమవారం తెలిపింది. కొన్ని ఉక్కు వస్తువులపై ఎగుమతి సుంకాన్ని విధించే ప్రభుత్వ చర్యపై EEPC ఇండియా చైర్మన్ మహేశ్ దేశాయ్ స్పందిస్తూ.. ఇంజనీరింగ్ వస్తువుల తయారీదారులు, ఎగుమతిదారులు ఈ చర్య వల్ల ప్రయోజనం పొందుతారని అన్నారు. ప్రపంచ మార్కెట్లలో మరింత పోటీతత్వం పొందుతారని అన్నారు. దీని వల్ల ఎక్కువగా రియల్టీ రంగానికి కూడా ప్రయోజనకరం కానుంది. నిర్మాణ ఖర్చు కొంత మేర తగ్గనుంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి.

ప్రాథమిక ఉక్కు ఉత్పత్తుల ధరలు ఉత్పత్తిదారులకు 10 శాతం, ద్వితీయ ఉక్కు ఉత్పత్తిదారులకు 15 శాతం తగ్గుతాయని ఎగుమతిదారులు భావిస్తున్నట్లు మహేశ్ అన్నారు. ఉక్కు పరిశ్రమ ఉపయోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్‌తో సహా కొన్ని ముడి పదార్థాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అలాగే.. ఇనుప ఖనిజం ఎగుమతులపై సుంకాన్ని 50 శాతం వరకు, కొన్ని ఉక్కు ఇంటర్మీడియరీలపై 15 శాతానికి పెంచారు. ఉక్కు కోసం ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయం దేశీయ ఉక్కు పరిశ్రమకు ధరను తగ్గిస్తుంది.

ఇంధన ధరల తగ్గింపు కంపెనీల లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది. అన్ని చర్యలు కలిసి పరిశ్రమకు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను అధిగమించడమే కాకుండా లిక్విడిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇదిలా ఉండగా.. నిర్మాణాల్లో ఉపయోగించే TMT బార్ల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయని ఆల్ ఇండియా ఇండక్షన్ ఫర్నేసెస్ అసోసియేషన్ (AIIFA) సెక్రటరీ జనరల్ కమల్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం టన్నుకు రూ.57,000 ఉన్న TMT బార్ల ధరలు.. ఈ రోజు టన్ను రూ.52,000 వద్ద ట్రేడవుతున్నాయి. టన్ను ఉక్కుపై ఏకంగా రూ.5,000 తగ్గింది. కడ్డీలు, బిల్లేట్ల ధరలు కూడా టన్నుకు రూ. 5,000 తగ్గించి వరుసగా టన్నుకు రూ. 50,000, రూ. 51,000/-గా ఉన్నాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఈ రంగంలో వ్యాపారం చేస్తున్న సెకండరీ ఆటగాళ్లకు ఉపశమనం కలగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి