SBI Loan Rates: హౌసింగ్ లోన్ కస్టమర్లకు SBI షాక్.. అమాంతం ఆ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం..

SBI Loan Rates: హోమ్ లోన్ తీసుకున్న వారిపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరింత భారాన్ని మోపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గృహ రుణంపై వడ్డీ రేటును అమాంతం పెంచింది.

SBI Loan Rates: హౌసింగ్ లోన్ కస్టమర్లకు SBI షాక్.. అమాంతం ఆ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం..
SBI
Follow us

|

Updated on: May 23, 2022 | 8:31 PM

SBI Loan Rates: హోమ్ లోన్ తీసుకున్న వారిపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరింత భారాన్ని మోపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గృహ రుణంపై దాని ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ని 50 బేసిస్ పాయింట్లను పెంచింది. దీంతో వడ్డీ రేటు 7.5%కి పెంచింది. పెరిగిన కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకింగ్ దిగ్గజం తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఇంతకుముందు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు 6.65 శాతంగా ఉండగా, రెపో-లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా ఉంది. వెహికల్, హౌసింగ్ లోన్ తో పాటు ఇతర రకమైన లోన్స్ ఇచ్చేటప్పుడు EBLR, RLLRకి క్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP)ని కలుపుతాయి.

జనవరి 2019 నుంచి SBI రెపో రేటుతో అనుసంధానించబడిన EBLRని ఉపయోగిస్తోంది. EBLR రేటు మారదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్‌మార్క్ వడ్డీ రేటుకి అనుగుణంగా మారుతూ ఉంటుంది. గత వారం.. SBI రుణాలపై దాని MCLR రేట్లను మళ్లీ 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. కొత్త MCLR వడ్డీ రేట్లు మే 15, 2022 నుంచి అమలులోకి వచ్చాయి.

ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల, ఆరు నెలల MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. వరుసగా 6.85 శాతం, 6.85 శాతం, 6.85 శాతం, 7.15 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా ఒక సంవత్సర కాలవ్యవధికి MCLR 7.20 శాతం, రెండు సంవత్సరాలకు 7.40 శాతం, మూడు సంవత్సరాలకు 7.50 శాతంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే