RBI Governor: వడ్డీ రేట్ల పెంపుపై సంచలన కామెంట్స్ చేసిన రిజర్వు బ్యాంక్ గవర్నర్.. వచ్చే సమావేశంలో..

RBI Governor: వడ్డీ రేట్ల విషయంలో రానున్న కాలంలో కూడా సంచలన నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ద్రవ్య విధాన సమావేశాలలో రెపో రేట్లు ఎలా ఉండనున్నాయో సంకేతాలు ఇచ్చారు.

RBI Governor: వడ్డీ రేట్ల పెంపుపై సంచలన కామెంట్స్ చేసిన రిజర్వు బ్యాంక్ గవర్నర్.. వచ్చే సమావేశంలో..
Shaktikanta Das
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 23, 2022 | 9:01 PM

RBI Governor: వడ్డీ రేట్ల విషయంలో రానున్న కాలంలో కూడా సంచలన నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ద్రవ్య విధాన సమావేశాలలో రెపో రేట్లలో కొంత పెరుగుదల ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. రెపో రేటు పెంపుపై ఎలాంటి పరిమితులు సెంట్రల్ బ్యాంక్ పెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. రేటు ఎంతమేర పెరుగుతుందో చెప్పలేనని.. కానీ అది కొవిడ్ ముందు స్థాయిలకు పెంచటం జరుగుతుందని స్పష్టం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు చేరిన వేళ మార్కెట్లో లిక్విడిటీని తగ్గించడంలో భాగంగా రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రేటు ఇంచుమించు 5.15 శాతానికి చేరవచ్చని తెలుస్తోంది.

వచ్చే రెండు MPC సమావేశాల్లో RBI వడ్డీ రేట్లను 5.15 శాతానికి పెంచవచ్చని సూచించే ప్రైవేట్ ఆర్థికవేత్తల అంచనాలపై అడిగిన ప్రశ్నకు దాస్ సమాధానమిచ్చారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశంలో RBI ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ సంచలన ప్రకటన చేసింది. రానున్న జూన్ MPC సమావేశంలో ద్రవ్యోల్బణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన అంచనాలను వెల్లడిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ దాస్ తెలిపారు. మార్చిలో విడుదల చేసిన చివరి అంచనాలు 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని 5.7 శాతంగా అంచనా వేసింది. అయితే ఈ ఏడాది మొత్తం ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరెంట్ ఖాతా లోటు (CAD) పరంగా RBI దానిని బాగా నిర్వహించగలదని దాస్ చెప్పారు. ఎగుమతులు వరుసగా 14 నెలల పాటు 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. దిగుమతులు కూడా పుంజుకున్నాయని, ధరలు పెరిగినప్పటికీ నిలకడగా ఉన్నాయని ఆయన తెలిపారు. దీనికి తోడు ఇతర కారణాల వల్ల కరెంట్ ఖాతా లోటు పెద్దగా పెరగకపోవచ్చని ఆయన తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించటంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఉపకరిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా కన్జూమర్ ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు పన్ను తగ్గింపులు, పన్ను రాయితీలపై ప్రకటనల తర్వాత ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యం 6.4 శాతం నుంచి 6.9 శాతానికి పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. 2022 బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక లోటు లక్ష్యాలను ప్రభుత్వం మార్చుకోకపోవచ్చని తాను భావిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి