Sai pallavi: ‘నేను స్పెషల్‌ సాంగ్స్‌లో నటించకపోవడానికి కారణం అదే’.. హైబ్రిడ్‌ పిల్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Sai pallavi: మారుతోన్న కాలానికి అనుగుణంగా నటీమణుల ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హీరోయిన్‌ పాత్రలకు మాత్రమే పరిమితమైన తారలు ఇప్పుడు. ఛాన్స్‌ వస్తే ఐటెం సాంగ్‌లలోనూ...

Sai pallavi: 'నేను స్పెషల్‌ సాంగ్స్‌లో నటించకపోవడానికి కారణం అదే'.. హైబ్రిడ్‌ పిల్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us

|

Updated on: May 24, 2022 | 6:15 AM

Sai pallavi: మారుతోన్న కాలానికి అనుగుణంగా నటీమణుల ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హీరోయిన్‌ పాత్రలకు మాత్రమే పరిమితమైన తారలు ఇప్పుడు. ఛాన్స్‌ వస్తే ఐటెం సాంగ్‌లలోనూ నటించడానికి వెనుకడుగు వేయడం లేదు. మరీ ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఉన్న వారు కూడా స్పెషల్‌ సాంగ్స్‌తో మెప్పిస్తున్నారు. సమంత, పూజా హెగ్డే, కాజల్‌, శృతీహాసన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదేనని చెప్పాలి. అయితే టాప్‌ హీరోయిన్ల రేసులో ఒకరిగా రాణిస్తున్న సాయి పల్లవి మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తోంది.

ఆ మాటకొస్తే గ్లామర్‌ పాత్రలకు సాయి పల్లవి మొదటి నుంచి దూరమేనని చెప్పాలి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవికి ఐటెం సాంగ్‌కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. స్పెషల్‌ సాంగ్ అవకాశం వస్తే చేస్తారా.? అని ఎదరైన ప్రశ్నకు ‘ఎట్టి పరిస్థితుల్లో చేయనని’ తేల్చి చెప్పింది సాయి. అయితే దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘స్పెషల్‌ సాంగ్స్‌ నాకు కంఫర్ట్‌గా ఉండవు. దీనికి కారణం ఆ సాంగ్స్‌లో ఉండే అవుట్‌ ఫిట్‌. వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండను. అందుకే అలాంటి పాటల్లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు’ అని క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంతో విజయాన్ని అందుకున్న సాయి పల్లవి తాజాగా విరాట పర్వం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో పాటు ఇటీవలే ‘గార్గి’ అనే మరో సినిమాకు సైన్‌ చేసిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ