Akira Nandan: ఆర్ఆర్ఆర్ దోస్తీ పాటకు పియానో వాయించిన అకీరా.. వీడియో వైరల్..

గతంలో అకీరా ఇంట్లో పియానో వాయిస్తున్న వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూనే వస్తుంది.

Akira Nandan: ఆర్ఆర్ఆర్ దోస్తీ పాటకు పియానో వాయించిన అకీరా.. వీడియో వైరల్..
Akira
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2022 | 2:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అకీరా మల్టీటాలెంటెడ్. కేవలం చదువులోనే కాకుండా.. సంగీతంలో, ఆటలలో మంచి పట్టు సాధించాడు.. ముఖ్యంగా పియానో వాయించడంలో అకీరా దిట్ట అన్న సంగతి తెలిసిందే. గతంలో అకీరా ఇంట్లో పియానో వాయిస్తున్న వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూనే వస్తుంది. అకీరా మల్టీటాలెంట్స్ చూసి పవన్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతుంటారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు తన స్నేహితుల కోసం అద్భుతంగా పియానో వాయించాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా అకీరా నందన్ తన గ్యాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నాడు.. నర్సరీ నుంచి ప్లస్ 2 వరకు అకీరా ఒకే స్కూల్లో చదివినట్లుగా తెలుస్తోంది. తన స్కూల్ గ్రాడ్యూయేషన్ డేలో స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు పియానోను అద్భుతంగా వాయించాడు.. అకీరా పియానో వాయిస్తున్న వీడియోను రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. “తన స్కూల్ స్నేహితుల కోసం ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ పాటకు పియానో వాయించాడు అకీరా.. 15 సంవత్సరాల పాఠశాల జీవితం పూర్తైంది.. (నర్సరీ నుంచి ప్లస్ 2 వరకు).. ఇప్పుడు తనకు కాలేజ్ సమయం ప్రారంభమైంది. చాలా త్వరగా ఎదిగిపోయాడు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అకీరా మల్టీటాలెంటెడ్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by renu (@renuudesai)