Anil Ravipudi: బాలయ్య సినిమాపై క్లారిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..

కామెడీ నా ప్రధాన బలం.. కానీ ఇప్పుడు దానిని పక్కనపెట్టి.. బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నా..

Anil Ravipudi: బాలయ్య సినిమాపై క్లారిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..
Anil Ravipudi
Follow us

|

Updated on: May 24, 2022 | 5:16 PM

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కాకుండా.. బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ చేయబోతున్నాడు. ఇంకా పట్టాలెక్కిన వీరిద్దరి కాంబో గురించి రోజుకో వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించనున్నాడని.. అంతేకాకుండా యువ కథానాయిక శ్రీలీల ఆయన కూతురిగా కనిపించనుందని టాక్ నడిచింది. (Anil Ravipudi) తాజాగా ఈ వార్తలపై స్పందించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న డైరెక్టర్.. ఇటీవల పాల్గోన్న ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో చేయబోయే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణతో తీయనున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. కామెడీ నా ప్రధాన బలం.. కానీ ఇప్పుడు దానిని పక్కనపెట్టి.. బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నా.. నా మార్క్ వినోదాత్మక సన్నివేశాలుంటాయి కానీ.. పూర్తిగా కామెడీగా కాదు.. సుమారు 50 ఏళ్ల వ్యక్తి బాలకృష్ణ, ఆయన కూతురిగా శ్రీలీల కనిపిస్తారు.. పోకిరి, గబ్బర్ సింగ్, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలను కథానాయకుడి పాత్రే ముందుకు తీసుకెళ్తుంది.. ఆ పాత్ర యాటిట్యూడ్ లోనే అన్ని హంగులుంటాయి. ఈ కాన్సెప్ట్ తోనే సినిమాను తెరకెక్కించబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఆయన తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధాన పాత్రలలో నటించారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ