Nayanatara: వాళ్లు బతికేది కేవలం 12 గంటలు మాత్రమే.. ఆసక్తి రేకెత్తిస్తోన్న నయనతార విషయాలు..
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు నయన్.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పెట్టింది పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు నయన్. జీఎస్ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓ2’ అనే చిత్రంలో నయనతార నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్ . సినిమా టైటిల్‌కు తగ్గట్లుగానే టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నయనతారతో పాటు కొందరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోతుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. లోయలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో బస్సులో ఉన్న వారంతా కేవలం 12 గంటలు మాత్రమే బతుకుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బస్సులో ఉన్న వారి మధ్య ఎలాంటి గొడవలు చోటుచేసుకుంటాయి? వారంతా బస్సులో నుంచి ఎలా బయటపడ్డారన్న విభిన్న కథాంశంతో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక నయనతార ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి. ఇక ‘ఓ2’ చిత్రాన్ని నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

