Viral Video: ఇదెక్కడి పిచ్చి..తల్లీ!.. పగిలిన గాజు ముక్కలను డ్రెస్‏గా మార్చుకుంది.. వైరలవుతున్న వీడియో..

పగిలిన గాజు ముక్కలతో తయారు చేసిన డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.

Viral Video: ఇదెక్కడి పిచ్చి..తల్లీ!.. పగిలిన గాజు ముక్కలను డ్రెస్‏గా మార్చుకుంది.. వైరలవుతున్న వీడియో..
Urfi Javed
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2022 | 4:47 PM

బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ సెన్స్ గురించి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆమె చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‏తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది (Urfi Javed).. తాను చేసే ఫోటోషూట్స్, డ్రెస్సింగ్ స్టైల్స్ వల్లే ఉర్ఫీ ఎక్కువగా ఫేమస్ అయ్యింది. డ్రెస్సింగ్‏లో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటుంది. దీంతో ఆమెపై ఎక్కువగా ట్రోలింగ్స్ జరుగుతుంటాయి. కొందరు ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ సెన్స్ కు మద్దతు తెలపగా.. మరికొందరు మాత్రం పిచ్చి అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే ఉర్ఫీ జావేద్.. తన పై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోదు.. అంతేకాకుండా.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసినవారికి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అందులో ఉర్ఫీ జావేద్.. పగిలిన గాజు ముక్కలతో తయారు చేసిన డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ” అవును.. నేను పగిలిన గాజు ముక్కలతో చేసిన డ్రెస్ ధరించాను.. ఇది అద్భుతంగా అనిపించిందని నేను అనుకుంటున్నాను.. కానీ ప్రజలు నన్ను పిచ్చి, వింత అంటూ పిలుస్తారు..కానీ మనమందరం వెర్రి, విచిత్రమైన సమాజంలోనే ఉన్నామని గ్రహించండి..నేను కేవలం నన్ను నేను చూసుకోవడానికి నాకు తెలివి, శక్తి ఉన్నాయి.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఉర్ఫీ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఉర్ఫీ మాత్రం తన వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ తో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)