Rare Note: అరుదైన నోటు అని వేలానికి పెట్టాడు.. పలికిన ధర చూసి కళ్లు తేలేశాడు.!

Rare Note: అరుదైన నోటు అని వేలానికి పెట్టాడు.. పలికిన ధర చూసి కళ్లు తేలేశాడు.!

Anil kumar poka

|

Updated on: May 24, 2022 | 4:44 PM

అరుదైన నాణేలు, నోట్లు ఆన్‌లైన్‌లో వేలం వేస్తుంటారని మనం వింటూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని అత్యధిక ధర కూడా పలుకుతుంటాయి. అయితే ఇప్పుడిదంతా ఎందుకంటే.! ఓ చారిటీ సంస్థలో దొరికిన అరుదైన నోటును వేలం వేయగా..


అరుదైన నాణేలు, నోట్లు ఆన్‌లైన్‌లో వేలం వేస్తుంటారని మనం వింటూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని అత్యధిక ధర కూడా పలుకుతుంటాయి. అయితే ఇప్పుడిదంతా ఎందుకంటే.! ఓ చారిటీ సంస్థలో దొరికిన అరుదైన నోటును వేలం వేయగా.. అనుకున్న ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముడైపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాలస్తీనాలోని ఆక్స్‌ఫామ్ అనే స్వచ్చంద సంస్థలో పాల్ అనే వ్యక్తి వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి 1927లో బ్రిటీష్ ప్రభుత్వం జారీ చేసిన 100 పౌండ్ల కరెన్సీ నోటు దొరికింది. సన్నిహితుల ద్వారా ఇది చాలా అరుదైన నోటు అని తెలుసుకున్న పాల్.. లండన్‌లోని స్పింక్ వేలం హౌస్‌లో వేలానికి పెట్టాలని అనుకున్నాడు.వెంటనే ఆ నోటును ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచాడు. ఇక ఆ నోటు వేలంలో ఏకంగా కోటి 3 లక్షలకు అమ్ముడుపోయింది. అసలు రేటు కంటే 1400 రెట్లు ఎక్కువకు అమ్ముడైందని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిజానికి ఆ నోటు విలువ 29 లక్షలట. కాగా, వేలంలో వచ్చిన ఆ మొత్తాన్ని ఆక్స్‌ఫామ్ స్వచ్చంద సంస్థ సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 24, 2022 04:44 PM