Monkeypox: అమెరికాలో అడుగుపెట్టిన మంకీపాక్స్‌.. బోస్టన్ నగరంలో ఒకరికి సోకినట్టు నిర్ధారణ..!

Monkeypox: మంకీపాక్స్‌ అమెరికాలో అడుగుపెట్టింది.బోస్టన్ నగరంలో ఒకరికి సోకినట్టు నిర్ధారణ అయింది. మరికొంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి విస్తరించకుండా

Monkeypox: అమెరికాలో అడుగుపెట్టిన మంకీపాక్స్‌.. బోస్టన్ నగరంలో ఒకరికి సోకినట్టు నిర్ధారణ..!
Monkeypox Outbreak
Follow us
uppula Raju

|

Updated on: May 24, 2022 | 5:37 PM

Monkeypox: మంకీపాక్స్‌ అమెరికాలో అడుగుపెట్టింది.బోస్టన్ నగరంలో ఒకరికి సోకినట్టు నిర్ధారణ అయింది. మరికొంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు CDC (Centers for Disease Control and Prevention) అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే మంకీపాక్స్‌ రిస్క్ తక్కువగానే ఉందని వైరస్ మరింత వ్యాప్తి చెందడానికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. సాధారణ ప్రజలకు మంకీపాక్స్‌ నిరోధక టీకాలు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కానీ మరికొన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ వైరస్ కౌగిలించుకోవడం, తాకడం, సన్నిహిత సంబంధం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అమెరికా, యూరప్‌లలో ఈ వ్యాధి విజృంభించడంతో అక్కడి శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ప్రపంచంలోని అనేక దేశాలలో చాలా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. నివేదికల ప్రకారం ఈ వ్యాధి అమెరికాతో పాటు బ్రిటన్, ఇటలీ, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్‌లకు విస్తరించింది. వాస్తవానికి ఇది యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఉద్భవించిందని అందరు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వ్యాధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి