Viral Video: మోడ్రన్‌ భరతనాట్యం.. నారీమణుల డ్యాన్స్‌ చూస్తే విజిల్‌ వేయాల్సిందే..!

Viral Video: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే ప్రతిరోజు అద్భుతమైన డ్యాన్స్‌ వీడియోలని చూడవచ్చు. కానీ ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ వీడియోను ఎప్పుడు చూసి ఉండరు.

Viral Video: మోడ్రన్‌ భరతనాట్యం.. నారీమణుల డ్యాన్స్‌ చూస్తే విజిల్‌ వేయాల్సిందే..!
Girls Bharatanatyam
Follow us
uppula Raju

|

Updated on: May 23, 2022 | 7:38 PM

Viral Video: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే ప్రతిరోజు అద్భుతమైన డ్యాన్స్‌ వీడియోలని చూడవచ్చు. కానీ ఇలాంటి క్లాసికల్ డ్యాన్స్ వీడియోను ఎప్పుడు చూసి ఉండరు. ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు ఇంగ్లీష్ పాటలపై హిప్హాప్, భరతనాట్యం కలగలపి అద్భుతమైన డ్యాన్స్‌ చేస్తారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వారిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ నృత్యాన్ని హైబ్రిడ్ భరతనాట్యం అంటారు. ఇందులో భరతనాట్యంతో పాటు ఇతర డ్యాన్స్ స్టెప్పులను మిక్స్ చేసి ఒక కొత్త రకమైన డ్యాన్స్‌ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు అమ్మాయిలు వేదికపై చీరలో డ్యాన్స్ చేయడాన్ని మీరు చూడవచ్చు. కొన్ని విదేశీ పాటలకు భరతనాట్య శైలిలో డ్యాన్స్ చేయడం మనం గమనించవచ్చు. అమ్మాయిలు తమ డ్యాన్స్‌కి వెస్ట్రన్ డ్యాన్స్‌ని జోడించి సూపర్‌గా డ్యాన్స్‌ చేస్తారు. వెస్ట్రన్ మ్యూజిక్‌కి వారు ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లని హుషారెత్తిస్తున్నాయి. ఈ వీడియోని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఉషా జే వృత్తి రీత్యా కొరియోగ్రాఫర్ ఆమె ఈ నృత్యానికి కొరియోగ్రఫీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఉషా జె అనే కొరియోగ్రాఫర్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీనిని హైబ్రిడ్‌ భరతనాట్యమని తెలిపింది. 1 నిమిషం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 32 వేల మందికి పైగా చూశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో వీడియో పోస్ట్‌ను 7 వేల మందికి పైగా లైక్ చేసారు. ప్రజలు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు 1600 మందికి పైగా వినియోగదారులు దీన్ని రీట్వీట్ చేశారు. ఇది కాకుండా చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలపండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే