Egg Price: తగ్గిన కోడిగుడ్ల ధరలు.. ఆందోళన చెందుతున్న పౌల్ట్రీ రైతులు..!

Egg Price: మార్కెట్లో ఒక్కసారిగా కోడిగుడ్ల ధరలు తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో కోడిగుడ్ల ధరలు 20 శాతం వరకు తగ్గాయి.

Egg Price: తగ్గిన కోడిగుడ్ల ధరలు.. ఆందోళన చెందుతున్న పౌల్ట్రీ రైతులు..!
Egg Price
Follow us
uppula Raju

|

Updated on: May 24, 2022 | 4:14 PM

Egg Price: మార్కెట్లో ఒక్కసారిగా కోడిగుడ్ల ధరలు తగ్గిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో కోడిగుడ్ల ధరలు 20 శాతం వరకు తగ్గాయి. గత పక్షం రోజులుగా కనిష్ట స్థాయికి చేరిన కోడిగుడ్ల ధరలు హోల్‌సేల్ మార్కెట్‌లలో కొంతమేర పెరగడం ప్రారంభమయ్యాయి. కానీ అంతలోనే మళ్లీ పతనం ప్రారంభమైంది. గుడ్డు ధరలు తగ్గడం ఇది రెండోసారి. ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్‌లో అతిపెద్ద పతనం నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా కోడిగుడ్ల ధర తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా కోడిగుడ్ల ధరలు వందకు సగటున రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గినట్లు సమాచారం. మే 1న కోడిగుడ్లు వందకు రూ.380 ఉండగా వారం రోజుల క్రితం వరకు రూ.500కు చేరుకుంది. కానీ గత రెండు రోజులుగా కోడిగుడ్ల ధర రూ.20 నుంచి 40 వరకు పడిపోయింది.

కోడిగుడ్ల ధరలు మళ్లీ పడిపోవడంతో రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో కోడిగుడ్ల ధర వందకు రూ.305 ఉండగా అది రూ.448కి చేరింది. కానీ గత రెండు రోజులుగా పతనం కావడంతో ఢిల్లీలో కోడిగుడ్ల ధర రూ.400 వద్ద కొనసాగుతోంది. అంటే 4 రూపాయల బ్యారేజీ ఉంది. ఎన్ఈసీసీ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఈ నెలలో కోల్‌కతాలో గుడ్డు ధర 535కి చేరగా సోమవారం రూ.55 తగ్గింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వ్యవసాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి