AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Diet: ఈ ఆహారపు అలవాట్లు కొవిడ్‌ ప్రమాదాన్ని 41% తగ్గిస్తాయి.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!

Healthy Diet: యూఎస్‌ఏ బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు వివిధ రకాల ఆహార అలవాట్లపై పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో మొక్కల ఆధారిత ఆహారాలతోకూడిన

Healthy Diet: ఈ ఆహారపు అలవాట్లు కొవిడ్‌ ప్రమాదాన్ని 41% తగ్గిస్తాయి.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..!
Healthy Diet
Follow us
uppula Raju

|

Updated on: May 25, 2022 | 4:21 PM

Healthy Diet: యూఎస్‌ఏ బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు వివిధ రకాల ఆహార అలవాట్లపై పరిశోధన నిర్వహించారు. ఈ అధ్యయనంలో మొక్కల ఆధారిత ఆహారాలతోకూడిన జీవన విధానం కొవిడ్‌ ప్రమాదాన్ని తగిస్తుందని తేల్చారు. ఎక్కువ పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు తినడం వల్ల కొవిడ్‌ వచ్చే ప్రమాదం 41 శాతం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తక్కువ పండ్లు, కూరగాయలు తిన్న వ్యక్తులతో పోలిస్తే వీరు అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, కొవిడ్ ఇన్‌ఫెక్షన్లు తగ్గడం మధ్య సన్నిహిత సంబంధం ఉందని నిపుణులు వాదిస్తున్నారు.

మంచి పోషకాహారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో ఈ విషయం అందరు గమనించారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం గురించి చాలామందికి అవగాహన లేదు. మంచి పోషకాహారం వైరస్‌ని అడ్డుకోపోయినా తొందరగా కోలుకోవడానికి పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంలో కొన్ని కీలకమైన పదార్థాలు ఉంటాయి. ఇవి వేగంగా కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి జింక్, విటమిన్ సి, విటమిన్‌ డి, సెలీనియం వంటి ఖనిజాలు చాలా సహాయంచేస్తాయి.

కోవిడ్ సోకిన వారికి వైద్యులు జింక్‌ మాత్రలని అందిస్తారు. జింక్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఒక వ్యక్తి శరీరంలో తగినంత మొత్తంలో జింక్ ఉంటే వారు తొందరగా కోలుకుంటారు. శరీరంలో జింక్ స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తి లేని వ్యక్తి కంటే వేగంగా కోలుకుంటాడు. జింక్ చిక్కుళ్ళు, పప్పులు టోఫులో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి కూడా అంతే ముఖ్యం. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులలో కోవిడ్ కారణంగా జరిగే నష్టాన్ని విటమిన్ సితో సులభంగా అధిగమించవచ్చు. విటమిన్ డి కూడా అంతే అవసరం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంలో చిక్కుళ్ళు, పప్పులు, పండ్లు, కూరగాయలు ఉండాలి. అలాగే కివి, పైనాపిల్, జామ పండ్లు ఎక్కువగా తినాలి. చికెన్, చేపలు, గుడ్లు పర్వాలేదు కానీ రెడ్ మీట్‌కి దూరంగా ఉంటే మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలు అస్సలు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి