Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ హెల్తీ డైట్‌ పాటించండి..!

Hair Care Tips: ఆధునిక కాలంలో చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జుట్టు సంరక్షణ కోసం చాలా మంది కెమికల్ అధికంగా ఉండే

Hair Care Tips: జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ హెల్తీ డైట్‌ పాటించండి..!
Healthy
Follow us

|

Updated on: May 25, 2022 | 5:06 PM

Hair Care Tips: ఆధునిక కాలంలో చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జుట్టు సంరక్షణ కోసం చాలా మంది కెమికల్ అధికంగా ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ ఉత్పత్తులు మన జుట్టును ఇంకా పాడు చేస్తాయి. హెల్తీ హెయిర్ కోసం హోం రెమెడీస్ ను ప్రయత్నించడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. హెల్తీ డైట్ జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి పని చేస్తాయి. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యల నుంచి రక్షించడానికి పనిచేస్తాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే డైట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలో తెలుసుకుందాం.

1. గుడ్లు

గుడ్లు అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. గుడ్లు ప్రోటీన్‌కి మంచి మూలం. జుట్టు రాలడాన్ని నివారించడానికి గుడ్లు తప్పనిసరిగా తినాలి. తక్కువ ప్రోటీన్ ఆహారాలు జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. దీని వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2. ఆకుపచ్చని కూరగాయలు

ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో విటమిన్ ఎ, ఐరన్, బీటా కెరోటిన్, ఫోలేట్, విటమిన్ సి ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.

3. అవకాడో

ఈ రోజుల్లో అవోకాడో ఒక సూపర్‌ఫుడ్‌గా మారింది. అవోకాడో చాలా రుచికరమైనది, పోషకమైనది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

4. వాల్నట్

గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ, జింక్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలు చాలా అవసరం. మీరు ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవచ్చు. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5. బెర్రీలు

బెర్రీలు చాలా రుచికరమైన పండ్లు. వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ద్వారా హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి మీ శరీరం నుంచి ఐరన్‌ ని గ్రహించి కొల్లాజెన్‌ని తయారు చేయడంలో సహాయపడుతుంది. జుట్టును పెంచే ప్రొటీన్లలో ఇది ఒకటి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.