Monkeypox: ప్రమాదకరంగా మారుతున్న మంకీపాక్స్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

Monkeypox: కరోనా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో తీవ్రమైన వ్యాధి ప్రజల జీవితాలని ఆగంచేస్తుంది. మీరు చికెన్ పాక్స్ పేరు వినే ఉంటారు కానీ ఇప్పుడు కోతుల నుంచి

Monkeypox: ప్రమాదకరంగా మారుతున్న మంకీపాక్స్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
Monkeypox
Follow us

|

Updated on: May 24, 2022 | 4:01 PM

Monkeypox: కరోనా నుంచి ప్రపంచం పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో తీవ్రమైన వ్యాధి ప్రజల జీవితాలని ఆగంచేస్తుంది. మీరు చికెన్ పాక్స్ పేరు వినే ఉంటారు కానీ ఇప్పుడు కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్‌ వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నివేదికల ప్రకారం.. ఈ వ్యాధి సోకిందంటే శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయి. ఇది మొదట నోటిపై కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లలో ఈ వ్యాధి విజృంభించడంతో అక్కడి శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. అయితే ప్రపంచంలోని అనేక దేశాలలో చాలా కేసులు నమోదవుతున్నాయి.

నివేదికల ప్రకారం ఈ వ్యాధి అమెరికాతో పాటు బ్రిటన్, ఇటలీ, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్‌లకు విస్తరించింది. వాస్తవానికి ఇది యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఉద్భవించిందని అందరు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వ్యాధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంకీపాక్స్‌ లక్షణాలు, తదితర విషయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 1958 లో ఈ వ్యాధి మొదట కోతులలో కనిపించింది. అప్పటి నుంచి దీనిని మంకీ-పాక్స్ అని పిలుస్తున్నారు. కానీ మానవులలో మొదటి కేసు 1970లో తెరపైకి వచ్చింది.

ఈ వ్యాధి సోకినప్పుడు అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లక్షణాలు 7 నుంచి 14 రోజులు ఉంటాయి. జ్వరం వచ్చిన తర్వాత 1 నుంచి 3 రోజులలో రోగికి దద్దుర్ల సమస్య మొదలవుతుంది. అవి మొదట నోటిపై ఏర్పడుతాయి. క్రమంగా ఈ దద్దుర్లు శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. మంకీపాక్స్‌ని గుర్తించడానికి అనేక పరీక్షలు చేస్తున్నారు. వాటిలో ఒకటి పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR). దీనిని ఒక రకమైన DNA పరీక్ష అంటారు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే