Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

weight loss tips: బరువు తగ్గాలంటే ఏం తినాలి.. గుడ్డా.. లేదా.. చికెనా..

ప్రస్తుతం అధిక బరువు(Weight) అందరిని వేధిస్తున్న ప్రశ్న.. అలా అని బరువు లేని ఏం సంబరపడిపోకండి. ఎందుకుంటే మీరు కూడా బరువు పెరగొచ్చు. అందుకే అధిక బరువుతో బాధపడేవారు కాదు మిగతా వారు కూడా రాత్రిపూట తేలికపాటి భోజనమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు...

weight loss tips: బరువు తగ్గాలంటే ఏం తినాలి.. గుడ్డా.. లేదా.. చికెనా..
Weight Loss (4)
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 24, 2022 | 2:48 PM

ప్రస్తుతం అధిక బరువు(Weight) అందరిని వేధిస్తున్న ప్రశ్న.. అలా అని బరువు లేని ఏం సంబరపడిపోకండి. ఎందుకుంటే మీరు కూడా బరువు పెరగొచ్చు. అందుకే అధిక బరువుతో బాధపడేవారు కాదు మిగతా వారు కూడా రాత్రిపూట తేలికపాటి భోజనమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రిపూట, ఉదయం తేలికపాటి ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతాయట. ముఖ్యంగా రాత్రి పూట కొంచెం ముందుగానే తినడం వల్ల జీర్ణక్రియ(digestion) ప్రక్రియను శక్తి కోసం ఉపయోగించినప్పుడు..ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.ఆహార-ప్రేరిత థర్మోజెనిసిస్ (DIT) అనేది భోజన సమయాన్ని బట్టి మానవ జీవక్రియ ఎంత బాగా పనిచేస్తుందో కొలవడానికి కొలమానం. అల్పాహారంలో తీసుకునే భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నప్పటికీ.. డిన్నర్ కోసం వినియోగించిన అదే భోజనం కంటే రెండు రెట్లు ఎక్కువ ఆహార-ప్రేరిత థర్మోజెనిసిస్ను సృష్టిస్తుందని అధ్యయనం కనుగొంది. ఎక్కువ అల్పాహారం, విందులో తేలికపాటి ఆహారం తీసుకు బరువు పెరిగే అవకాశాలు ఉండవట.

అందుకే తక్కువ కేలరీలు గుడ్డుని తీసుకుంటే మంచిదట. ఒక గుడ్డులో కేవలం 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1.5 గ్రాముల సంతృప్త కొవ్వు, ఇనుము, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్లు ఉంటాయి. సుమారు 85 గ్రాముల బరువున్న చికెన్‌లో ఒక సర్వింగ్, 122 క్యాలరీలు, 24 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, కార్బోహైడ్రేట్లు, నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ బి 12, రిబోఫ్లేవిన్ వంటి ఇతర ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. గుడ్డు లేదా చెకెన్ ను బరువు తగ్గడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో తింటారు. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో కూడిన ఆహారం. అలాగే వండటం కూడా సులువే. గుడ్డు లేదా చెకెన్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ సౌలభ్యం, మీ శరీరం దానిని ప్రాసెస్ చేసే విధానం, వండిన రెసిపీ రకాన్ని బట్టి గుడ్డు లేదా చికెన్ ను తినవచ్చు. ఉదాహరణకు వేయించిన చికెన్ కంటే.. కూరగాయలతో చేసిన చికెనే మీ హెల్త్‌కు మంచిది. ఇది జీర్ణక్రియకు మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తలకు ఇక్కుడ క్లిక్ చేయండి..