AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఏటీఎంలు వాడేవారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి రూ.10, రూ.20, రూ.50 నోట్లు కూడా విత్ డ్రా.. ఎలానో చూడండి..

చిన్న విలువ నగదు డిమాండ్‌ను నోట్లు, నాణేల కలయిక ద్వారా తీర్చవచ్చని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. ఏటీఎంల ద్వారా చిన్న కరెన్సీ నోట్ల విత్ డ్రాపై ప్రకటన చేశారు.

ATM: ఏటీఎంలు వాడేవారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి రూ.10, రూ.20, రూ.50 నోట్లు కూడా విత్ డ్రా.. ఎలానో చూడండి..
Atm
Venkatrao Lella
|

Updated on: Mar 10, 2026 | 9:06 PM

Share

ఏటీఎంలలో ప్రస్తుతం రూ.500, రూ.200, రూ.100 నోట్లు వస్తున్నాయి. అన్నింటికంటే రూ.500 నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే పెద్ద నోట్లను మాత్రమే ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా.. చిన్న నోట్లను ఉపసంహరించుకునే సదుపాయం ఇప్పటివరకు అందుబాటులో లేదు. అయితే త్వరలో ఏటీఎం నుంచి రూ.10, రూ.20, రూ.50 లాంటి చిన్న నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా సాంప్రదాయ ఏటీఎంల నుంచి చిన్న విలువ కలిగిన నోట్లను పంపిణీ చేసే కార్యక్రమం  మోదలైందని రాజ్యసభలో కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశంలో చిన్న నోట్ల కొరత లేదని స్పష్టం చేశారు.

తగినంతగా అందుబాటులో..

పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. దేశంలో చిన్న నోట్ల కొరత లేదని, తగినంతగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రూ.10, రూ.20, రూ.50 చిన్న విలువ కలిగిన నోట్లు ఇప్పటికే తగినంత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.500, రూ.100, రూ.200 నోట్లు ఏటీఎంల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వీటి ద్వారా ఏదైనా కొనుగోలు చేయాలంటే చిల్లర సమస్య ఏర్పడుతుంది. ఇక ప్రజలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల కొరత ఏర్పడుతుంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు ఏటీఎంల నుంచి చిన్న నోట్లను కూడా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిల్లర సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక చిన్న విలువ డిస్పెన్సర్లు పరీక్షించబడుతున్నాయని, ఇవి ప్రజలు నేరుగా చిన్న కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ప్రజలను ఏటీఎంల నుంచి ఈ విధానంలో చిల్లర పొందగలుగుతారని పేర్కొన్నారు.

ఎన్ని నోట్లు ఉన్నాయంటే..?

చిన్న కరెన్సీ నోట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే దానిపై కేంద్ర ప్రభుత్వ రాజ్యసభలో వివరాలు వెల్లడించింది. ఫిబ్రవరి 26 వరకు కేంద్ర బ్యాంకు రూ.439.4 కోట్ల విలువైన రూ.10 నోట్లు సరఫరా చేయగా.. రూ.193.7 కోట్ల రూ.20 నోట్లు, రూ.130 కోట్ల రూ.50 నోట్లు సరఫరా చేసినట్లు తెలిపింద. ఇక గత ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్ల రూ.10 నోట్లు, రూ.150 కోట్ల రూ.20 నోట్లు సరఫరా చేయగా.. ఇక రూ.300 కోట్ల రూ.50 నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. వివిధ విలువల కరెన్సీలకు ఉన్న డిమాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని, ఎన్ని నోట్లను ముద్రించాలో సిఫార్సు చేస్తుందని పేర్కొంది.

Follow Us
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం