TSPSC Group 1 2022: 3 లక్షలకు చేరువలో టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తులు.. రెండు రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31తో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు..

TSPSC Group 1 2022: 3 లక్షలకు చేరువలో టీఎస్పీఎస్సీ గ్రూప్‌ 1 దరఖాస్తులు.. రెండు రోజుల్లో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
Tspsc Group 1
Follow us

|

Updated on: May 29, 2022 | 7:19 AM

TSPSC Group-1 2022 Application last date: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31తో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచిచూడకుండా వెంటనే దరఖస్తు చేసుకోవల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. కాగా 503 గ్రూప్‌1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఇప్పటివరకు 2,33,249 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రూప్‌1 దరఖాస్తుకు ముందు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో నమోదు చేసుకున్నవారు కూడా తమ స్థానికత వివరాలను పొందుపరచవల్సి (ఎడిట్‌) ఉంటుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 80,000ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్‌1తో పాటు పలు పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్‌1 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ మే 2 నుంచి ప్రారంభమైంది. మొత్తం 18 శాఖల్లో 503 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్‌www.tspsc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.