AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పేద విద్యార్థిని చదువుకు ఎన్నారై చేయూత..

పేదరికం ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమెరికాకు చెందిన తానా ప్రతినిధి రవి పోట్లూరి ఉదారత చాటుకున్నారు. పాణ్యంలోని రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సి. శ్రావణికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా చెక్కును అందజేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు రవికి కృతజ్ఞతలు తెలిపారు.

Andhra Pradesh: పేద విద్యార్థిని చదువుకు ఎన్నారై చేయూత..
Student Financial Support
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2026 | 7:16 AM

Share

పాణ్యం: పేదరికం ఏ విద్యార్థి ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ చదువుతున్న ఓ నిరుపేద విద్యార్థిని చదువు కోసం అమెరికాకు చెందిన తానా ప్రతినిధి రవి పోట్లూరి ఆర్థిక సాయం అందించి తన ఉదారత చాటుకున్నారు. రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న సి. శ్రావణికి రూ.50,000 సాయం అందజేశారు.

పాణ్యం మండలంలోని రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం అభ్యర్థిస్తున్న సి. శ్రావణి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతోంది. ఈ విషాయాన్ని తెలుసుకున్న అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన ‘తానా’ (TANA) ప్రతినిధి రవి పోట్లూరి స్పందించి, ఆ విద్యార్థిని చదువు నిమిత్తం రూ. 50,000 ఆర్థిక సాయాన్ని పంపించారు. రవి పోట్లూరి తరఫున పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి స్వయంగా ఈ చెక్కును విద్యార్థిని శ్రావణికి అందజేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి కలలకూ అడ్డుకాకూడదని, అందుకోసం తన వంతుగా సాయాన్ని అందించానని రవి పోట్లూరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థిని శ్రావణి కష్టపడి చదివి భవిష్యత్తులో ఉజ్వలంగా స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు.

కష్టకాలంలో ఉన్న విద్యార్థినికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన ఎన్నారై రవి పోట్లూరికి స్థానిక ఎమ్మెల్యే అభినందించారు. సాయం అందించిన రవికి విద్యార్థిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us