Permanent Smile Disease: తథాస్తు! పర్మెనెంట్‌గా నవ్వుతూ ఉండూ.. అరుదైన వైకల్యంతో జన్మించిన చిన్నారి!!

ముఖంపై చెరగని చిరునవ్వుండాలని పెద్దలు చెబుతుంటారు. అంటే కష్టనష్టాలకు, ఒడిదుడుకులకు బెదిరిపోకుండా ధైర్యంగా ఉండాలని వారి ఉద్ధేశ్యం. ఇది అందరికీ సాధ్యం కాదు. మనోధైర్యం నిండుగా ఉండే ఏ కొందరో ఆచరిస్తుంటారు.

Permanent Smile Disease: తథాస్తు! పర్మెనెంట్‌గా నవ్వుతూ ఉండూ.. అరుదైన వైకల్యంతో జన్మించిన చిన్నారి!!
Baby (Image Credit: cristinakylievercher_)
Follow us
Srilakshmi C

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2024 | 10:26 AM

Baby born with smile: ముఖంపై చెరగని చిరునవ్వుండాలని పెద్దలు చెబుతుంటారు. అంటే కష్టనష్టాలకు, ఒడిదుడుకులకు బెదిరిపోకుండా ధైర్యంగా ఉండాలని వారి ఉద్ధేశ్యం. ఇది అందరికీ సాధ్యం కాదు. మనోధైర్యం నిండుగా ఉండే ఏ కొందరో ఆచరిస్తుంటారు. ఐతే దేవుడు పొరపాటున తథాస్తు అన్నాడో.. ఏమోగానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప పర్మనెంట్‌ స్మైల్‌తో జన్మించి ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అర్థంకాలేదా.. పుట్టుకతో వచ్చే అరుదైన వైకల్యంతో జన్మించిన ఈ పాప ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందన్నమాట.

2021 డిసెంబర్‌లో జన్మించిన ఈ పాప పేరు ఐలా సమ్మర్ ముచా. ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు క్రిస్టినా వెర్చర్ (21), బ్లైజ్ ముచా (20) ఐలాకు జన్మనిచ్చారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఐలాలో ఈ రుగ్మత ఉన్నప్పటికీ.. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో తాము గుర్తించలేదని వైద్యులు మీడియాకు తెలిపారు. దీనివల్ల చిన్నారి నోరు చాలా పెద్దగా తెరచుకుంటుంది. ఫలితంగా పాలు తాగడానికి, ఆహారం తినడానికి వీలుపడదు. ఈ విధమైన శారీరక వైకల్యాన్ని మాక్రోస్టోమియా అని అంటారు. క్లెఫ్ట్ ప్యాలేట్-క్రానియోఫేషియల్ జర్నల్‌లో (2007) ప్రచురించిన కథనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 మంది మాత్రమే ఈ అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెల్పింది. శస్త్ర చికిత్స ద్వారా చిరునవ్వును సరిచేయమని ఐలా తల్లిదండ్రులు వైద్యులను సంప్రదిస్తున్నారు. అంతేకాకుండ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తు, తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి