APPSC Group-1 Results: ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటినుంచంటే..

ఆంద్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన (APPSC) గ్రూపు-1 (2018) మెయిన్స్‌ పరీక్షల ఫలితాలు గురువారం (మే 26) విడుదలయ్యాయి. .

APPSC Group-1 Results: ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పటినుంచంటే..
Appsc Group 1 Results
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 11:51 AM

APPSC Group 1 interview date 2018: ఆంద్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన (APPSC) గ్రూపు-1 (2018) మెయిన్స్‌ పరీక్షల ఫలితాలు గురువారం (మే 26) విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఫలితాల్లో 325 మంది తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైనవారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌ 15 నుంచి ఇంటర్వ్యూలు (Group 1 interview) నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల ఆన్సర్‌ షీట్లను డిజిటల్‌ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పెన్ను, పేపర్‌ పద్ధతిలోనే మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఇప్పుడు విడుదల చేసింది.

కాగా తాజా ఫలితాల్లో డిజిటల్‌ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. కాగా ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి