AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.1,750.. దరఖాస్తు చేసుకోండిలా..

ఏపీలోని అనాధ పిల్లలకు శుభవార్త. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వీరికి ఆర్ధిక సాయం అందిస్తున్నాయి. ఈ పథకం కింద అనాథలు ప్రతీ నెలా రూ.1700 వరకు సాయం పొందవచ్చు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు చూద్దాం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.1,750.. దరఖాస్తు చేసుకోండిలా..
Money
Venkatrao Lella
|

Updated on: Feb 27, 2026 | 2:50 PM

Share

ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. అనాథ పిల్లకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ వాత్యల్స పథకాన్ని ఏపీ ప్రభుత్వ అమలు చేస్తోంది. ఈ పథకం కింద అనాథ పిల్లలు ప్రతీ నెలా ఆర్ధిక సహాయం పొందవచ్చు. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ నగదు సాయం అందిస్తున్నారు. రూ.1250 నుంచి గరిష్టంగా రూ.1750 వరకు ప్రతీ నెలా సాయం పొందవచ్చు. అనాథలైన పిల్లలకు విద్య, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే అర్హతలేంటి..? ఎవరెవరికి నగదు సాయం అందుతుంది? దరఖాస్తు చేసుకోవడం ఎలా? అనే వివరాలు తెలుసుకుందాం.

అర్హులు ఎవరంటే..?

టెర్రరిస్ట్ హింస, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం, సరిహద్దు కాల్పుల కారణంగా అనాధలైన పిల్లలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హర్‌మోనీ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థను నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ ద్వారా కేర్ ఫర్ ఎడ్యుకేషన్ కేటగిరీలో అర్హులైన అనాధ పిల్లలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.

ఎవరికి ఎంతంటే..?

టెన్త్, ఐటీఐ, డిప్లోమా, కంప్యూటర్ కోర్సుల వరకు రూ.1250 ప్రతీ నెలా అందిస్తారు. ఇక గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రూ.1500, మెడికల్, ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారికి రూ.1750 ప్రతీ నెలా అందిస్తారు. గరిష్టంగా 25 సంవత్సరాలు లేదా చదువు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ నగదు సాయం అందిస్తారు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెలా వీటిని జమ చేశారు.

ఈ అర్హతలు తప్పనిసరి

-అనాథ లేదా నిరాశ్రయులై ఉండాలి -ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యాసంస్ధలో చదువుతూ ఉండాలి -ఫీల్డ్ వెరిఫికేషన్‌లో అర్హత పొంది ఉండాలి -టెర్రిరిస్ట్, క్రాస్ బోర్డర్ ఫైరింగ్ ప్రభావిత కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది.

అర్హుల గుర్తింపు ఎలా అంటే..?

మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హుల గుర్తింపు జరుగుతోంది. ముందుగా ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలంయలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేపడతారు. అనాథలు అని తేలితే పథకం కింద లబ్ది పొందేందుకు ఎంపిక చేస్తారు. అనాధ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్,  ఇన్‌కమ్ సర్టిఫికేట్, విద్యాసంస్థ బోనఫైడ్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

Follow Us