Andhra Pradesh: ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ జూనియర్ కాలేజీల్లో 2022-23 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ మైనార్టీ జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియేట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ..
AP Residential Minority Junior College admissions 2022: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ మైనార్టీ జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియేట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) కార్యదర్శి నరసింహారావు బుధవారం (మే 25) ఓ ప్రకటనలో తెలిపారు. 2022లో 10వ తరగతి మార్కుల ప్రాతిపదికన ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలలో బోధన ఉంటుందని, మే 30 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లా వాయల్పాడుల్లో రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. పూర్తి వివరాలను http://aprs.apcfss.in వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి